జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం

కరోనా వైరస్ (Coronavirus) బారిన పడకుండా ఉండేందుకు మార్చి 22 ఆదివారం నాడు దేశంలోని ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ (Janata curfew) పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ అమలులో ఉండనుంది.

Last Updated : Mar 21, 2020, 01:35 AM IST
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ (Coronavirus) బారిన పడకుండా ఉండేందుకు మార్చి 22 ఆదివారం నాడు దేశంలోని ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ (Janata curfew) పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ అమలులో ఉండనుంది. జనతా కర్ఫ్యూ సందర్భంగా దేశంలోని ప్రజలంతా వారి వారి ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఎంతో అవసరమైతే తప్ప.. అది కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించిన అనంతరమే ఇళ్లనుంచి బయటికి రావాలని.. లేదంటే అసలు బయటికే రావొద్దని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపునకు మద్దతుగా భారతీయ రైల్వే (Indian Railway) సైతం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 21న అర్థరాత్రి నుంచి (తెల్లవారితే 22 మార్చి ఆదివారం) ఆదివారం రాత్రి 10 గంటల వరకు సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లతో పాటు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు (Passenger trains cancelled) చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంకొన్ని రైళ్లను తెల్లవారుజామున 4 గంటల నుంచి నిలిపేయనున్నట్టు ఇండియన్ రైల్వే ప్రకటించింది. అంతకంటే ముందుగానే స్టేషన్ నుంచి బయల్దేరిన రైళ్లను వాటి గమ్యస్థానం చేరుకోవడానికి అనుమతించనున్నట్టు రైల్వే శాఖ అధికారులు స్పష్టంచేశారు. ఇప్పటికే మార్చి 20 నుండి మార్చి 31ల మధ్య కాలంలో 84 రైళ్లను రద్దు చేసినట్టు ఇదివరకే ప్రకటించిన రైల్వే శాఖ.. తాజాగా ఈ నిర్ణయం తీసుకుని ఆ రోజు ప్రయాణం ప్లాన్ చేసుకున్న రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చింది.

Read also : ఈ వాట్సాప్ నెంబర్‌తో Coronavirus తాజా సమాచారం తెలుసుకోండి

జనతా కర్ఫ్యూ (During Janata curfew) జరిగే సమయంలో ప్రయాణాలు చేయాల్సి వచ్చి, రైళ్లు రద్దయిన కారణంగా స్టేషన్లలోనే ఉండిపోవాలని అనుకునే ప్రయాణీకుల (Train passengers) కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రైల్వే స్టేషన్లు, వెయిటింగ్ హాళ్లలో బస చేసేందుకు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తామని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రకటించింది. అయితే, అదే సమయంలో కరోనావైరస్ (COVID-19) వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ఆదివారం నుండి రైళ్లలో క్యాటరింగ్ సేవలు నిలిపేస్తున్నట్లు ఐఆర్‌సిటీసి స్పష్టంచేసింది. ప్రయాణికులకు మరీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టీ, కాఫీ, స్నాక్స్ లాంటి వాటిని ప్యాకేజ్డ్ ఫుడ్‌గా అందించనున్నారు. 

Read also : ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దు: కిషన్ రెడ్డి

ఇదిలావుంటే, రద్దు అయిన రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు రైల్వే శాఖ ముందస్తు సమాచారాన్ని అందించడంతో పాటు టికెట్ క్యాన్సిలేషన్ ఫీజు లేకుండా వారికి 100% నగదును తిరిగివ్వనున్నట్టు రైల్వే అధికారులు పీటీఐకి వెల్లడించారు. జనతా కర్ఫ్యూ సమయంలో రైల్వే శాఖలో అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తారని.. మిగతా వాళ్లు విధులకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News