AP Government: ఏపీలో జనాభా పెంచే చర్యలు, ఇద్దరి కంటే తక్కువ పిల్లలుంటే నో ఛాన్స్

AP Government: అధిక జనాభా సమస్యతో భారతదేశం ఇబ్బంది పడుతూ జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే..ఏపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఏపీలో జనాభా పెంచే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 16, 2025, 11:45 AM IST
AP Government: ఏపీలో జనాభా పెంచే చర్యలు, ఇద్దరి కంటే తక్కువ పిల్లలుంటే నో ఛాన్స్

AP Government: దేశంలో జనాభా నియంత్రణకు ఓవైపు చర్యలు చాలా కాలంగా అమల్లో ఉన్నాయి. మరోవైపు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. జనాభా పెరుగుదలను ప్రోత్సహించే విధంగా కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందుకు తగిన సన్నాహాలు చేస్తోంది. 

ప్రపంచ జనాభాలో భారతదేశానిదే అగ్రస్థానం. ఇప్పటికే చైనాను దాటేసింది. కానీ వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఉత్పాదక శక్తి కలిగిన యువతరం జనాభా తగ్గిపోతోంది. అయితే జనాభా నియంత్రణలో భాగంగా దశాబ్దాలుగా తీసుకుంటున్న చర్యలు దక్షిణాదిలో జనాభా తగ్గుదలకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. దాంతో పెద్ద కుటుంబాల్ని ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఇద్దరు కంటే ఎక్కువమంది పిల్లలున్న కుటుంబాల్ని ప్రోత్సహించాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తోంది. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ సంతానం కలిగినవారినే పోటీకి అవకాశం కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది. అంటే 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే తక్కువ సంతానం ఉండేవారికి పోటీ చేసే అర్హత ఉండకపోవచ్చు. ఏపీలో జనాభా తగ్గడంతో కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోతోందని వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జనాభా ప్రాతిపదికన జనాభా నియంత్రణకు ప్రయత్నించడంతో ఆదాయం తగ్గిపోయింది. జనాభా తగ్గడం, చిన్న కుటుంబాల సంఖ్య పెరగడంతో యువతరం సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 

ఈ క్రమంలో జనాభా పెరుగుదలపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇద్దరు కంటే తక్కువ పిల్లలుండేవారికి పంచాయితీల్లో పోటీకు అవకాశం కోల్పోవచ్చు. జనాభా పెరుగుదల సంక్షోభం నేపధ్యంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉండవచ్చు. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలుంటేనే సర్పంచ్, మేయర్, కౌన్సిలర్, కార్పొరేటర్ పదవులు వరించవచ్చు. 

ఉత్తర భారతదేశానికి జనాభా ప్రయోజనం కొన్నాళ్లే ఉండవచ్చనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది. సంపద సృష్టించి ఆదాయం పెంచే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా జనాభాను విస్మరించాయంటున్నారు. అందుకే జనాభా పెంచే ప్రయత్నం చేయాలంటున్నారు. 

Also read: Free Vandebharat Journey: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, వందేభారత్ రైళ్లు, విమానంలో ఉచిత ప్రయాణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News