Naga Chaitanya - Sobhita: ఈ సంక్రాంతి శోభిత, నాగ చైతన్య దంపతులకు వెరీ వెరీ స్పెషల్.. పెళ్లి తర్వాత తొలి పండగ..

Naga Chaitanya - Sobhita: నాగ చైతన్య, శోభితల పెళ్లి గతేడాది చివర్లో డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా జరిగింది. మ్యారేజ్ తర్వాత వచ్చిన తొలి పండగ సంక్రాంతిని ఈ కొత్త దంపతులు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన పిక్ ను అక్కినేని కొత్త దంపతులు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

1 /5

Naga Chaitanya - Sobhita: నాగ చైతన్య, శోభిత పెళ్లి తర్వాత వచ్చిన తొలి పండగ సంక్రాంతి. ఇక అక్కినేని ఫ్యామిలీకి సంక్రాంతి పండక్కి అవినాభావ సంబంధం ఉంది. ఈ స్టూడియో కట్టి నిన్నటితో 50 యేట ప్రవేశించింది. 1975ల అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సహకారంతో హైదరాబాద్ బంజారాహిల్స్ లో 22 ఎకరాల్లో ఆగష్టు 13న ఈ స్టూడియోకు అక్కినేని మనవడు సుమంత్ చేతులు మీదుగా  శంకుస్థాపన చేశారు.

2 /5

1976 జనవరి 14 అప్పటి రాష్ట్రపతి ఫకృద్దిన్ అలీ అహ్మద్ చేతులు మీదుగా అన్నపూర్ణ స్టూడియో ప్రారంభమైంది. అప్పటి ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి అప్పటి సీఎం జలగం వెంగళరావుతో పాటు ఆయన సహ నటుడు ఎన్టీఆర్ తో పాటు రామానాయుడు, వాణిశ్రీ సహా ఇతర నటీనటులు, రాజకీయ ప్రముఖులు ఈ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమానికి  హాజరయ్యారు.

3 /5

రాళ్లు, గుట్టలతో ఉన్న ఈ ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియోను అక్కినేని ఎంతో శ్రమకోర్చి నిర్మించారు. తొలి సినిమా సెక్రటరీ మూవీని నిర్మించారు. మొత్తంగా నాగ చైతన్య, శోభిత పెళ్లి తర్వాతే అన్నపూర్ణ 50వ వసంతంలోకి అడుగుపెట్డడం.. అందులోనే నాగ చైతన్య, శోభితల వివాహాం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ఆయన ఆశీర్వాద బలంతో జరగడం విశేషమనే చెప్పాలి.

4 /5

నాగ చైతన్య.. పెళ్లి తర్వాత విడుదల కాబోతున్న తొలి చిత్రం ‘తండేల్’. ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో మరోసారి చైతూ సరసన సాయి పల్లవి నటిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

5 /5

అంతేకాదు ఈ యేడాది నాగ చైతన్య, తన నిజ జీవిత భాగస్వామి అయిన శోభితతో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. దీన్ని అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై చైతూ తండ్రి నాగార్జున నిర్మించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా దర్శకుడు ఎవరనేది త్వరలో ప్రకటించనున్నారు.