Cold Wave: తెలంగాణలో చంపేస్తోన్న చలి.. మరో రెండు రోజులు పాటు తీవ్రమైన చలిగాలులు..


Cold Wave in Telangana : సంక్రాంతికి చంపేంత చలి ఉంటుందనేది పెద్దలు చెప్పే విషయం. తాజాగా ఈ సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా చలి గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో మరో రెండు రోజులు పాటు తెలంగాణకు చలి పులి పంజా విసరనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

1 /6

Cold Wave: తెలంగా రాష్ట్రంలో రాగల రెండు వరకు చలి తీవ్రత అధికంగా ఉండనుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ లో చలి తీవ్రంగా ఉండనున్నట్టు వాతావరణ శాఖ విశ్లేషించింది.

2 /6

తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరం, ఆగ్నేయ దిశ నుండి వీస్తున్న చలి గాలుల వల్ల చలి తీవ్రత పెరిగింది. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణంతో చలి తీవ్రంగా పెరిగే అవకాశాలున్నాయి.

3 /6

అంతేకాదు  రాబోయే 2 రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే రెండు మూడు రోజుల్లో  కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

4 /6

ఉదయం వేళ పొగమంచు కారణంగా ఉదయం వేళ రహదారులు కనపడటం లేదు. ముందుగా ఎవరొస్తున్నారన్నది తెలియడం లేదు. దీంతో వాహన దారులు అప్రమత్తంగా ఉండి వాహనాలు నడపాలని వాతావరణ శాఖ తెలియజేసింది.

5 /6

ఉదయం సమయంతో పాటు రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టనున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు కూడా దాటడం లేదు. ఉదయం 10 గంటల వరకు మంచు వీడకపోవడంతో ఉదయం కార్యాలయానికి వెళ్లేవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.  

6 /6

ముఖ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు  చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ జాబ్స్ వెళ్లే రైతులు, కార్మికులు, విద్యార్ధులు ఇతర పనులు చేసుకునేవారు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు.