నిర్భయ కేసులో అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. రేపు యథాప్రకారం నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది. చివరి నిముషంలో ట్విస్ట్ ఎదురైనప్పటికీ సుప్రీం కోర్టు చెక్ పెట్టేసింది.
నిర్భయ కేసులో చివరి అంకానికి మరికొద్ది గంటలే మిగిలి ఉంది. ఈ కేసులో దోషులకు రేపు ఉరి శిక్ష అమలు చేయాలని ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఫైనల్ డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రేపు ఉరి శిక్ష అమలు ఉన్న సమయంలో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా. . సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. అత్యాచారం జరిగిన సమయంలో తాను మైనర్ గా ఉన్నానని.. అందుకోసం ఉరి శిక్ష కాకుండా తన శిక్షను యావజ్జీవానికి తగ్గిస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ పెట్టుకున్నాడు. దీనిపై ఈ రోజు (గురువారం ) ఆరుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. న్యాయమూర్తులు పవన్ గుప్తా అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు. పిటిషన్ ను బెంచ్ కొట్టివేసింది. దీంతో ఈ కేసులో చివరి అడ్డంకి కూడా తొలగిపోయినట్లయింది.
Read Also: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం
మరోవైపు నిర్భయ కేసులో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి కాబట్టి.. రేపు (శుక్రవారం) వారికి ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉందని నిర్భయ తల్లి ఆశాదేవీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు కోర్టులకు దోషుల తెలివి అర్ధమైందని ఆమె అన్నారు. ఇప్పటికే కోర్టులు వారికి చాలా అవకాశాలు ఇచ్చాయని తెలిపారు. పవన్ గుప్తా పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేయడంపై హర్షం వ్యక్తం చేశారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.
రేపే నిర్భయకు న్యాయం జరుగుతుందా..?