Danam Nageder: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏదీ చేసినా సంచలనమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఎమ్మెల్యేగా గెలిచి నెలలు కూడా గడవకముందే అధికార పార్టీలో చేరిపోయారు. ఏ పార్టీలో గెలిచాం అన్నది ముఖ్యం కాదు.. అధికార పార్టీలో ఉండటం.. తన సొంత పనులను చేసుకోవడమే తనకు ముఖ్యమని చెప్పకనే చెప్పేశాడు. ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్న దానం నాగేందర్ మరోసారి హాట్‌టాపిక్ అయ్యారు. సొంత పార్టీ చేసినా కామెంట్స్ సంచలనంగా మారాయి. అధికార పార్టీలో ఉంటూనే.. ఆయన చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నాయి..
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. అధికార పార్టీలో చేరిపోయారు దానం నాగేందర్. అప్పటికే బీఆర్ఎస్ పార్టీలో పదేళ్లు అధికారం చేలాయించిన దానం నాగేందర్.. ఆ వెంటనే గులాబీ జెండాను ఓ మూలన పడేసి.. హాస్తం పార్టీ కండువాను భూజానికెత్తుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన ఢిల్లీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడితేగానీ కాంగ్రెస్‌లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. కానీ అధికార పార్టీలో చేరడమే ఆలస్యం.. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తెచ్చుకుని అధికార పార్టీలో తన హవా ఏస్థాయిలో ఉందో చూపించాడు. అయితే ఎంపీ ఎన్నికల్లో దానం నాగేందర్‌ను సికింద్రాబాద్ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. కానీ దానం నాగేందర్ మాత్రం తన స్పీడ్‌ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధికార పార్టీలో చేరారు. అయితే అధికార పార్టీలో చేరినప్పటీ నుంచి దానం నాగేందర్ తీరు మాత్రం వివాదస్పదం అవుతోంది.. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక.. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల్ని మొదలు పెట్టారు. గ్రేటర్ పరిధిలో చెరువులు, కుంటలు కబ్జా , ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఈ చర్యతో దానం నాగేందర్ షాక్ తగిలింది. తన సొంత నియోజకవర్గం పరిధిలో హైడ్రా కూల్చివేతలను దానం నాగేందర్ అడ్డుకోవడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార పార్టీలో కొనసాగుతూ ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని కాంగ్రెస్ నేతలు దానంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఆ తర్వాత పుష్ప -2 సినిమా విషయంలోనూ దానం నాగేందర్ తీరు వివాదస్పదం అయ్యింది. పుష్ప-2 సినిమా బెన్పిట్ షోలో ఓ మహిళా మృతిచెందడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్టు దాకా మ్యాటర్ వెళ్లింది. దాంతో రేసులోకి వచ్చిన దానం నాగేందర్.. అల్లు అర్జున్ను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. రేవంత్ చర్యతో కాపు కులస్తులు కాంగ్రెస్‌కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని కామెంట్స్ చేశారు. తాజాగా దానం నాగేందర్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఫార్ములా రేసు కేసులో మంత్రి కేటీఆర్‌కు మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. ఫార్ములా రేసుతో హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పారు. గతంలో చంద్రబాబు ఫార్ములా రేసును హైదరాబాద్ తీసుకొద్దామని ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలిపారు. కానీ కేటీఆర్ మాత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని పొగడ్తల వర్షం కురిపించారు. అయితే అధికార పార్టీలో కొనసాగుతూ ప్రతిపక్ష నేతలను దానం ప్రశసించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అంతేకాదు.. గతంలో దానం నాగేందర్ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ అయ్యింది. అధికార పార్టీలో చేరిన కొత్తలో బీఆర్ఎస్ నేతలపై ఆయన నోరు పారేసుకున్నారు. అప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన దానం నాగేందర్ తీరును చూసి కాంగ్రెస్ నేతలే నోరెళ్ల బెట్టారట. కానీ ఈ ఏపిసోడ్ ముగిసిన వెంటనే ఆయన.. మాజీమంత్రి కేటీఆర్‌ను కలిసి సారీ చెప్పినట్టు ఆయనే ఒప్పుకున్నారు. దాంతో దానం నాగేందర్ అధికార పార్టీలో ఉన్నారా..! లేక ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తోంది. అధికార పార్టీ నేతలను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ కామెంట్స్ చేసి ఉంటారని గాంధీ భవన్లో చర్చ జరుగుతోందట. మరోవైపు దానం ఎలాంటి బ్లాక్ మెయిల్‌కు దిగినా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ వివాదస్పద వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ స్పందించారు. దానం నాగేందర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తంగా దానం ఏపిసోడ్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టందని పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: Liquor Price Down: ఏపీ ప్రజలకు 'సంక్రాంతి కిక్కు'.. భారీగా మద్యం ధరలు తగ్గుముఖం
Also Read: Weather Update: ఉపరితల ఆవర్తనం.. రెండు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు ఐఎండి హెచ్చరిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter