Sanjeeva Reddy: సంగారెడ్డి జిల్లాలోని నారాయణ ఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో చాలాసార్లు కాంగ్రెస్ జెండానే ఎగిరింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి నారాయణఖేడ్‌లో అక్కడ అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ 2016 ఏడాదిలో కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2016లో జరిగిన ఉప ఎన్నికలో నారాయణ ఖేడ్‌లో తొలిసారి గులాబీ పార్టీ జెండా ఎగిరింది. అక్కడ బీఆర్ఎస్ నుంచి తొలిసారి గెలిచారు బీఆర్‌ఎస్ నేత భూపాల్ రెడ్డి. 2018 ఎన్నికల్లోనూ మరోసారి సిట్టింగ్ సీటును నిలబెట్టుకున్నారు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు డాక్టర్ సంజీవ రెడ్డి భారీ విజయం సాధించారు. అయితే ఇప్పుడు అదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మధ్య పచ్చగడ్డ వేయకున్న భగ్గుమంటోందని టాక్ వినిపిస్తోంది..
ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ ఖేడ్‌లో సంజీవ రెడ్డి భారీ విజయం సాధించారు. కిష్టారెడ్డి వారుసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంజీవ రెడ్డి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి చుక్కలు చూపించారు సంజీవ రెడ్డి.. కానీ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా పూర్తికాకముందే ఆయనకు ఎంపీ సురేష్ షెట్కార్ నుంచి తీవ్రమైన ఆధిపత్య పోరు ఎదురవుతోందట. తాజాగా నామినేటేట్ పోస్టులు, మార్కెట్ కమిటీ పోస్టుల వ్యవహారంలో ఇద్దరు నేతలు నువ్వానేనా అనుకునే దాకా పరిస్థితులు మారిపోయాయని చెబుతున్నారు. పదవుల విషయంలో ఇద్దరు నేతలు తగ్గకపోవడంతో రెండు వర్గాల అనుచరుల్లో తీవ్ర ఒత్తిడి నెలకొందని సమాచారం.
మరోవైపు 2018 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సురేష్ షెట్కార్‌కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దాంతో అప్పటివరకు కాంగ్రెస్‌లో కొనసాగిన సంజీవ రెడ్డి అనూహ్యంగా కమలం పార్టీలో చేరిపోయి సురేష్ షెట్కార్ పై పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో సంజీవ రెడ్డి పార్టీ మారి ప్రత్యర్థిగా మారడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకలా మారిందని చెబుతారు. అయితే కొద్దిరోజులకే సంజీవ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు కలిసిపోయినట్టే కనిపించినా..లోపల మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందనే చెప్పాలి.. అప్పట్లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఇద్దరు నేతలు ఎవరికి వారుగా విడిపోయి అధినేతకు స్వాగతం పలకడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి సురేష్ షెట్కార్‌కే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ ఎన్నికల చివరి నిమిషంలో సురేష్ షేట్కార్ అనుహ్యంగా పక్కకు తప్పుకున్నారు. అప్పటికే సంజీవ రెడ్డి పార్టీ మారి షెట్కార్‌పై పోటీకి దిగేందుకు సిద్దమయ్యారు. దాంతో షెట్కార్ పక్కకు తప్పుకున్నారు. అయితే ఊహించని పరిణామంతో షెట్కార్ స్థానంలో సంజీవ రెడ్డికే పార్టీ పెద్దలు బీఫామ్ ఇచ్చారు. కానీ ఈ ఎన్నికలో సంజీవ్ రెడ్డి భారీ విజయం సాధించారు. అటు పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా సురేష్ షెట్కార్ విజయం సాధించారు. దాంతో మరోసారి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుందని నియోజకవర్గంలో ప్రజలు బహిరంగంగానే చర్చించుకున్నారు. తాజాగా నామినేటేడ్ పోస్టుల విషయంలో ఇద్దరు నేతల తమ అనుచరులకే పదవులు కావాలంటూ పట్టుబట్టడం ఖేడ్ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్ అయ్యింది..
మొత్తంగా ఇద్దరు నేతలు ఎక్కడ తగ్గకపోవడంతో నారాయణఖేడ్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందోనని క్యాడర్ టెన్షన్ పడుతోందట. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది.
Also Read: Daaku Maharaaj Movie: డాకు మహారాజ్‌కు థియేటర్‌లో ఎదురుదెబ్బ.. థమన్‌పై ఫ్యాన్స్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.