Karthika Deepam 2: జ్యోత్స్నకు దీప చేతిలో దబిడి దిబిడి.. ఈ భూమ్మిదే లేకుండా చేస్తానని శపథం..

Karthika Deepam 2 Today January 14th Episode: నీకు ఎంత డబ్బు కావాలి? బావ, నిన్ను ఇలా కష్టాల్లో వదిలేసి నేను వెళ్లలేను అంటుంది జో. మేము ఇడ్లీలు, బోండాలు వేసుకున్నాం మీరు వెళితే మా వ్యాపారం మేం చేసుకుంటాం పో ఇక్కడి నుంచి అని జో పై అరుస్తాడు. కార్తీక్‌ బాబు అంత కోపం ఏంటి జ్యోత్స్స నువ్వు ఇక్కడి నుంచి ముందు వెళ్లిపో అంటుంది దీప.
 

1 /9

నువ్వు ఇలా కష్టపడటం నేను చూడలేను నా సాయం నువ్వు తీసుకునే వరకు మళ్లీ మళ్లీ వస్తాను అంటుంది జో. వెళ్లోస్తాను బావ, అత్త అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కారు వద్దకు వెళ్లి నువ్వు ఎంత పొమ్మన్నా నిన్ను మాత్రం వదలను బావ అంటుంది. బావ నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు కానీ, టిఫిన్‌ బండీ కాల్చిన వారిని మాత్రం వదిలేదు లేదు అంటాడు కాశి. బండీ కీ ఇవ్వు అంటాడు కార్తీక్‌. దీప నువ్వు కూడా నాతో రా అంటాడు. ఎక్కడి బాబు అంటుంది? మీరెందుకు ఇంత కోపంగా ఉన్నారు అంటుంది. ఎక్కు దీప చెబుతాను అంటాడు ఇద్దరూ కలిసి బండి పై వెళ్తారు.  

2 /9

అనసూయ, కాంచనలు కంగారు పడతారు. స్పీడ్‌గా వెళ్లి జ్యోత్స్నకు అడ్డు పడతాడు. కారు దిగు నిన్నే కారు దిగు అని పిలుస్తాడు. ఏమైంది కార్తీక్‌ బాబు అంటుంది దీప. ఎందుకు చేశావ్‌? అంటాడు.. ఏంటి బావా? అంటుంది జో. ఆవేశాన్ని సగం చంపుకుని అడుగుతున్నా ఎందుకు చేశావ్‌? అని కార్తీక్‌ జో ను నిలదీస్తాడు. ఏమైంది కార్తీక్‌ బాబు అంటుంది దీప. రాత్రి నుంచి నా కోపాన్ని నేను కంట్రోల్‌ చేసుకోలేకపోతున్న ఈ మహాతల్లి ఓదార్పు యాత్ర చేస్తుంది. అందుకే ఆగడం నావల్ల కాలేదు, చెప్పు ఎందుకు చేశావ్‌ లాగి పెట్టి కొడతా అంటాడు.  

3 /9

దీప అడ్డుకుంటుంది. ఏం జరిగిందో చెప్పండి అంటుంది. తన జోలికి వెళ్లకండి బాబు మీరు నాతోనే మాట్లాడండి. అంత తప్పు ఏం చేసింది? బాబు అంటుంది. మన టిఫిన్‌ బండి కాలిపోవడానికి కారణం ఎవరో కాదు జోత్య్సే అంటాడు కార్తీక్‌ షాక్‌ అవుతుంది దీప. అవును దీప ఆ రౌడీని తరుముకుంటూ వెళితే తెలిసింది వాడికి కాల్‌ వచ్చింది అది జ్యోత్స్న నంబర్‌. మనకు అన్నం పెట్టిన అమ్మను కాల్చివేసింది ఈ మనిషిని ఏం చేయాలి? చెప్పు దీప అంటాడు. లాగి జ్యోత్స్నను ఒక్కటి పీకుతుంది దీప.  

4 /9

నా కారణంగా కార్తీక్‌బాబును ఇబ్బంది పెట్టావ్‌ మారుతావనుకున్న వదిలేశాం ఎందుకు చేశావ్ అడిగేది నిన్నే, దాన్ని కాల్చడానికి నీకు మనస్సు ఎలా వచ్చిందే? చెప్పు అని జో చెంపల మీద వాయిస్తూనే ఉంటుంది. దీప ఆగు అంటాడు కార్తీక్‌. ఆ రౌడీ తగులబెట్టాడేమో అనుకున్నా జ్యోత్స్న ఈ పనిచేస్తుంది అనుకోలేదు, మళ్లీ ఏం తెలియనట్లే ఎలా ఓదార్చడానికి వచ్చింది అని ఏడుస్తుంది. అప్పుడు కార్తీక్‌ బండి తగులబెట్టింది జ్యోత్స్న అని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు, నా మేనకోడలు ఇంత నీచురాలు అని అసహ్యించుకుంటుంది అందుకే మౌనంగా ఉన్నా.. కానీ, ఈ మనిషే మళ్లీ ఇంటికి వచ్చి రెచ్చగొట్టింది.  

5 /9

నీ చెంప పగులగొట్టి బుద్ధి చెబుతా అనుకున్నా.. నువ్వు అసలు మా అత్త కూతురేనా? అంటాడు. సుమిత్రమ్మ గారితో ఈ మనిషిని పోల్చకండి బాబు ఆమె దేవత అంటుంది దీప. ఇదే లాస్ట్‌ వార్నింగ్‌ మావాళ్లను మీవాళ్లను చూసి ఊరుకుంటున్నా అంటాడు. బట్టల్ని బండకేసి ఉతికినట్లే ఉతికి ఆరేయడమే పదండి కార్తీక్‌ బాబు అంటుంది. నువ్వు తగులబెట్టింది మా టిఫిన్ సెంటర్‌ను మాత్రమే మా పనిని కాదు, నువ్వు ఎంత తొక్కితే అంత పైకి ఎదుగుతాం. నువ్వు కార్తీక్‌ బాబును ఓడించలేవు ఎందుకంటే కార్తీక బాబు పక్కన ఈ దీప ఉంది అని అక్కడి నుంచి కార్తీక్‌ దీపలు కలిసి వెళతారు.  

6 /9

ఆ రౌడీ తప్పించకున్నాడంటే నిజం ఎవరికీ తెలియదనుకున్నా.. నేనేం మాట్లాడినా ఇంటికి వస్తాడు అనుకున్నా తింటే నాలుగు చెంప దెబ్బలు తిన్నా ఈ దీపది బండ చేయి గట్టిగా తగిలింది. ఈ విషయం అత్త, అమ్మతో చెప్పాడు కదా.. నువ్వు శివన్నారాయణ వారసురాలు అని తెలిసేలోగా నిన్ను ఈ భూమి మీద ఉండనివ్వ పూర్తిగా పాతాళానికి తొక్కి, నిన్ను బావను వేరు చేసి భూమి మీద లేకుండా చేసి అప్పుడు బావను పెళ్లి చేసుకుంటా.. అంత వరకు నేనే నీ పాలిట శత్రువు దీప అంటుంది జో.  

7 /9

ఇద్దరూ ఇంటికి వస్తారు.. సరుకులు తీసుకుని వస్తారు అన్నారు కదరా అంటుంది కాంచన. అవును కదా.. మర్చిపోయా అంటాడు. ఒరేయ్‌ కార్తీక్‌ జో ను ఎప్పుడూ లేనిది ఇలా కసురుకున్నావు అంటుంది. ఏం చేసింది రా అంటుంది కాంచన. ఏం చేయలేదు అమ్మ కార్తీక్‌ బాబు మీరు లోపలి వెళ్లండి అంటుంది దీప.నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని లోపలికి ఇద్దరూ వెళ్లిపోతారు. అమ్మ జ్యోత్స్నను మంచి వ్యక్తిలా చూస్తోంది. అది తట్టుకోలేకపోయా. జ్యోత్స్న మన టిఫిన్‌ బండి కాలిపోవడానికి కారణం అని అమ్మకు తెలియాలి అంటాడు. ఈ విషయాన్ని దాసు డోర్‌ వద్ద ఉండి వింటాడు. వద్దు కార్తీక్‌ బాబు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అంటుంది దీప.  

8 /9

తక్కువ రోజుల్లోనే ఆ బండికి మనకు ఒక ఎమోషన్‌ జర్నీ స్టార్ట్‌ అయింది. దాన్ని జ్యోత్స్న కాలి బూడిద చేసింది అంటాడు. దాసు కూడా ఇక శివన్నారాయణకు అసలు విషయం ఈరోజే చెబుతా అని బయలుదేరతాడు. ఇంటి దగ్గర జ్యోత్స్న అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుంది. పారు చూసి ఏంటి దవడ మీద ఎవరు కొట్టారు.. చెబుతావా? లేకపోతే తాతకు చెప్పాలా? అంటుంది. దీప అని ెబుతుంది. మొగుడు పెళ్లాలు కలిసి ఇలా చేశారా? ఇక వాళ్లు అయిపోయారు. బండి కాలిపోయింది అని జాలి పడితే ఉండు.. తాతకు చెబుతా పాపం అని పలకరించడానికి వెళితే నిన్ను కొడతారా? వాళ్ల టిఫిన్‌ సెంటర్‌ కాల్చేసింది ఎవరో కాదు.. నేను ఆ విషయం తెలిసి చేయి చేసుకున్నారు.   

9 /9

ముందుగా బావకు తెలిసింది. ఆ విషయం దీప కు చెప్పాడు నా మొఖం చట్నీ చేశారు అంటుంది. నీకు ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయంటే.. నువ్వు ఇలా ఉంటే నిన్ను కాపాడటం నావల్ల కాదు. చెంపదెబ్బతో సరిపెట్టారు ఇంటికి వచ్చి గొడవచేస్తే అంటుంది పారు. చేస్తే చేయని అంటుంది జో. నీపేరుపై ఆస్తి పెట్టేవరకు కాస్త ఓపిక పట్టవే అంటుంది పారు.