Karthika Deepam 2 Today January 11 Episode: చూశావా అమ్మ నాన్న నీకు కూడా లాకెట్ ఇవ్వడంటా అంటుంది శౌర్య. అది కార్తీక్ బాబు సొంత విషయం అంటుంది దీప. ఆగండి అని వెంటనే లాకెట్ మెడలో నుంచి తీసేస్తాడు. నా మెడలో వేస్తే ఇంకా హ్యాపీ అంటుంది శౌర్య. ఇది మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మర్చిపోండి ఇక ఎవరి కంట పడనివ్వకుండా జాగ్రత్త తీసుకుంటా అంటాడు కార్తీక్.
నువ్వు ఈరోజు ఇవ్వకపోయిన అది నాదే.. నాకు నచ్చింది అంటుంది శౌర్య. అది నీ అమ్మదే శౌర్య మీ అమ్మమ్మ జ్ఞాపకం అంటుంది దీప. మరోవైపు సుమిత్ర శివన్నారాయణతో జో చేసిన తప్పు గురించి చెబుతుంది. నాతో సారీ చెప్పించారు రేపటి నుంచి వాళ్లతో నేను ఎలా వర్క్ చేయాలి అంటుంది జో. అవరసరం లేదు నువ్వు రేపటి నుంచి ఆఫీసుకు వెళ్లకర్లేదు అంటాడు తాత. నేను సీఈఓగా నే ఉంటా అంటుంది జో.
ఇంత చదువుకున్నావ్ ఎలా ఆలోచించాలి తెలీదా అంటాడు దశరథ. ఈరోజు నువ్వు ఎంప్లాయీస్ తీసేయడంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నామో కార్తీక్‌లకు తెలిసేలా చేశావు. నువ్వు సారీ చెబితే మేకు కూడా చెప్పినట్లే అంటాడు శివన్నారాయణ. నిన్ను చూసి గర్వపడుతున్న అన్నాను కదా.. ఇప్పుడు నిన్ను చూసి సిగ్గుపడుతున్న అంటాడు. ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోను లేకపోతే నేను దీప ముందు తగ్గిపోతా అంటుంది ఇలా ఆలోచించడం ఇప్పుడైనా ఆపు అంటుంది సుమిత్ర.
దశరథ కూడా ఏ నిర్ణయం తీసుకుంటారు మీ ఇష్టం నాన్న అంటాడు. తాతా ప్లీజ్ తాతా ఇంకెప్పుడు తప్పు చేయను అంటుంది జో. సరే నిన్ను క్షమిస్తున్నా కానీ నువ్వు చేసిన తప్పు మాత్రం మర్చిపోను. ఆ దీప ముందు తక్కువ చేశావు. ఇవన్నీ ఓకే కానీ, నువ్వు ఆ కార్తీక్ గాడు ముందు నన్ను చాలా అవమానపడేలా చేశావు అంటాడు ఈరోజు జరిగిన అవమానం ఓ గుణపాఠం. జీవితాంతం గుర్తుపెట్టుకో వెళ్లు అంటాడు. పారిజాతం.. నువ్వు జో తో మాట్లాడటానికి వీల్లేదు అంటాడు.
జరిగిన అవమానాన్ని జీవితాంతం మర్చిపోను బావ. తప్పు చేశావు దీప జో ను ఓడిస్తే ఏం జరుగుతుందో నేను చెబుతా అనుకుంటుంది జ్యోత్స్న. ఇక శ్రీధర్ ఇంట్లో డ్యాన్స్ చేస్తుంటాడు. అసలు విషయం భార్యకు చెబుతాడు. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. నీకు ఆనందంగా ఉంది. నా తిక్క మామ నాకు ఎదురుపడితే నేనే ఉతికి ఆరేస్తా. ఇక నా కొడుకు పాత సైకిల్ మీద షికార్లు కొడుతూ టిఫిన్ బండి మీద పొట్లాలు కడుతున్నాడు. నేను ఏదో చిన్న తప్పు చేస్తే పరువు పోయింది అన్నారు కదా ఇప్పుడు వాళ్ల పరువే పోయింది దేవుడు ఉన్నాడు అంటాడు. రేయ్ మైడియర్ నేను చేయలేని పని నువ్వు చేశావు రా.. శివ డార్లింగ్‌కు తిక్క కుదిరింది అంటాడు శ్రీధర్.
ఇక జో ధర్నాలో జరిగిన విషయాన్నే పదే పదే గుర్తు చేసుకుంటుంది. అప్పుడే తన రూమ్‌కు పారిజాతం తాడు పట్టుకుని వస్తుంది. నీకు జరిగిన అవమానం తగ్గాలంటే ఇది ట్రై చేయ్ అని ఇస్తుంది. తప్పు చేశానన్న బాధ నా కళ్లలో కనిపిస్తుందా? అంటుంది జో. ఒక వేట మిస్ అయినప్పుడు మరో వేట కోసం వేటాడాలి. నీ మాట, నీఆలోచన, నీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది జ్యోత్స్న. నువ్వు ఎక్కడో రూట్ తప్పావు. తప్పుల మీద తప్పులు చేశావు. దీప మీద కోపంతో కార్తీక్ నుంచి మీ తాత తీసేశాడు. కానీ, ఇప్పుడు నువ్వు చేసే పనులు కార్తీక్ కరెక్ట్ అనేలా చేశావు అంటుంది పారు.
నువ్వు ఆలోచించాల్సింది దీప గురించి అంటుంది. టార్గెట్ మనకంటే బలమైనప్పుడు దానికో వీక్ పాయింట్ ఉంటుంది అక్కడ కొట్టాలి. లేదంటే ఇలా ఓడిపోయి అందరి ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. మీ తాత నీ గురించి ఏ నిర్ణయం తీసుకోక ముందే తప్పును సరిదిద్దుకో అని చెప్పి వెళ్లిపోతుంది పారు.
అల్రేడీ సరిచేసే ప్రయత్నం మొదలు పెట్టాను గ్రానీ అనుకుంటుంది జో. దీప కంట్లో కన్నీళ్లు చూడాల్సిందే అని ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని కాల్ చేస్తుంది. మరోవైపు దీపకు చేయి నొప్పి అవుతుంది. ఏమైంది దీప అంటాడు కార్తీక్. మొద్దటి నుంచి రాత్రి పడుకునే వరకు కాలంతో పోటీ పడి పనిచేస్తే ఇలాంటివే జరుగుతాయి. ఇప్పటి వరకు చేసిన పనులు చాలు, కొబ్బరినూనే, పెయిన్ బామ్ ఏంది అంటాడు కార్తీక్. ఈ పెయిన్ బామ్‌లు ఆడవారి జీవితంలో సగభాగం అయిపోయాయి అంటాడు కార్తీక్. ఇటివ్వండి నేను రాసుకుంటా అంటుంది దీప. నువ్వు నా తలకు రాస్తే నేను వద్దంటానా? అంటాడు.
నువ్వు ఆలోచించాల్సింది దీప గురించి అంటుంది. టార్గెట్ మనకంటే బలమైనప్పుడు దానికో వీక్ పాయింట్ ఉంటుంది అక్కడ కొట్టాలి. లేదంటే ఇలా ఓడిపోయి అందరి ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. మీ తాత నీ గురించి ఏ నిర్ణయం తీసుకోక ముందే తప్పును సరిదిద్దుకో అని చెప్పి వెళ్లిపోతుంది పారు.
ఏంటి అలా చూస్తున్నావ్? అంటాడు కార్తీక్ ఎప్పుడైన కాళ్ల నొప్పులు అంటే మా అమ్మకు రాసేవాడిని ఆ అలవాటే ఇది అంటాడు. చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకుంటున్నారా? అంటుంది దీప. మరి ఏం చేయమంటావ్ అంటాడు. దీప నీకు ఈత వచ్చా? అంటాడు. అయితే, నేను సముద్రంలో దూకేయవచ్చు అన్నమాట అంటాడు. వచ్చు కానీ, మర్చిపోయాను బాబు అంటుంది దీప. ఆడపిల్ల అమాయకపు నవ్వు చాలా అందంగా ఉంటుంది దీప. నువ్వు నవ్వితే చాలా బాగుంటావ్ అని శీతాకాలం సూర్యుడు అని పోలుస్తాడు. త్వరగా పడుకో దీప లేదంటే ఆరోగ్యం పాడవుతుంది వచ్చేయ్ అని కార్తీక్ వెళ్లిపోతాడు.