HMPV: హైదరాబాద్‌లో 11 చైనా వైరస్‌ కేసులు.. కానీ, ప్రైవేటు ల్యాబ్‌ వివరణ ఇదే..!

HMPV Virus In Hyderabad: హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే, మొదటగా కర్నాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్‌ సోకింది. వీళ్లు ఎవ్వరూ అంతర్జాతీయంగా ట్రావెల్‌ చేయలేదు అన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో 11 చైనా వైరస్‌ కేసులు నమోదు అయ్యాయని షాకింగ్‌ రిపోర్ట్‌ బయటకు వచ్చింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

చైనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. మొదట కర్నాటకలో రెండు కేసులు బయటకు వచ్చాయి. ఈ నెల మూడో తేదీ టెస్ట్‌ చేయగా విషయం బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. కానీ, ఐసీఎంఆర్‌ పలువురు నిపుణులు ఈ వైరస్‌ కొత్తది ఏం కాదు కరోనా వైరస్‌ వంటిది కాదు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నయం అవుతుంది అన్నారు.  

2 /5

ఆ తర్వాత గుజరాత్‌, చెన్నైలో కూడా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు చైనాలో కూడా వైరస్‌ వ్యాప్తితో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆసుపత్రులన్ని కిక్కిరిసి పోయాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై ఆరోగ్య సూచనలు కూడా చేశాయి.  

3 /5

తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో గత ఏడాది డిసెంబర్‌లోనే హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు అయినట్లు ఓ ప్రైవేటు ల్యాబ్‌ వెల్లడించింది. ముఖ్యంగా దాదాపు 229 మంది వరకు శ్వాసకోశ పరీక్షలు చేయించుకోగా ఈ విషయం బయటకు వచ్చింది.   

4 /5

వైద్య పరీక్షలు చేయగా 11 శాంపిల్స్‌ హెచ్‌ఎంపీవీ పాజిటివ్ వచ్చింది అని మణి మైక్రో బయాలజీ ల్యాబ్‌ తెలిపింది.ఇప్పటికే డిశ్చార్జీ అయ్యారని చెప్పింది. ఇది వరకు అందరూ చెప్పినట్లే ఈ వైరస్‌ కొత్తది ఏం కాదని ఎవరూ ఆందోళన చెందకూడదని పేర్కొంది. ఇదే విషయాన్ని ఐసీఎంఆర్‌ కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. ‌  

5 /5

అయితే, గత సంవత్సరం చివరి నెల నుంచి చాలామంది జలుబు, దగ్గు, సీజనల్‌ జబ్బులతో ఇక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోయారు. కానీ, అవి మాములు సీజనల్‌ జబ్బులు మాత్రమే అనుకున్నారు. కానీ, మాములు కంటే ఎక్కువ రోజులు ప్రభావం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఐసీఎంఆర్‌  తల్లిదండ్రులకు సూచనలు కూడా చేసింది.