Sandhya theatre stampede case: సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే పోలీసులు 18 మందిపై కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది. తాజాగా, పోలీసులు.. అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు.
అల్లు అర్జున్ కు చిక్కడ పల్లి పోలీసులు మరో బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తొంది. పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఈ ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కోర్ట్ వారు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చిక్కడ పల్లి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.
రేపు ఉదయం అంటే.. మంగళవారం.. ఉదయం 11 గంటలకు తమ ముందు హజరు కావాల్సిందిగా పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.
ప్రస్తుతం ఈ అంశం మాత్రం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పుష్ప2 గురించి మాట్లాడటంతో ఇది కాస్త పోలిటికల్ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తొంది.
కొన్ని పార్టీలు అల్లు అర్జున్ కు అండగా ఉండగా.. మరికొన్ని పార్టీలు మాత్రం అల్లు అర్జున్ తీరును తప్పుపడుతున్నట్లు తెలుస్తొంది. అదే విధంగా అల్లు అర్జున్ ఆగమేఘాల మీద సీఎం రేవంత్ మాట్లాడగానే మీడియా సమావేశం నిర్వహించడం కూడా కాంట్రవర్సీగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు.. బెయిల్ రద్దుకై హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేయనున్నట్లు తెలుస్తొంది.