Kasturi shankar shocking comments on allu arjun arrest: పుష్ప2 సినిమా వివాదం ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తుందని చెప్పుకొవచ్చు. ఒక వైపు ఇండస్ట్రీ పరంగాను ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా రాజకీయంగాను ఈ అల్లు అర్జున్న వివాదం కాకరేపుతుందని చెప్పుకొవచ్చు. డిసెంబరు 4 న పుష్ప2 మూవీ ప్రీమియర్ షో లో భాగంగా ఈ సినిమా చూసేందుకు దిల్ సుఖ్ నగర్ నుంచి రేవతి తన కుటుంబంతో సహా వచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అక్కడిక్కడే చనిపోగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ మాత్రం ఆస్పత్రిలో వెంటిలెటర్ మీద చికిత్స పొందుతున్నాడు.
అయితే.. పోలీసులు సంధ్య థియేటర్ పై, అల్లు అర్జున్ పై కూడా కేసును నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కొన్నిరోజుల క్రితం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి, కోర్టులో హజరు పర్చి.. రిమాండ్ కు తరలించారు. అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను లభించిందని చెప్పుకొవచ్చు. అప్పటి నుంచి ఈ వివాదం ఇంకా పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు.
Jail life Mari ila untundha🙏 pic.twitter.com/f6bk7Onh1W
— రాG 🌸 రెడ్డి గారి అమ్మాయి❣️ (@Nithya_pspk) December 22, 2024
ఇదిలా ఉండగా..అల్లు అర్జున్ ను కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.దీనిలో భాగంగా పోలీసులు ఆయనను చంచల్ గూడ్ జైలుకు తరలించారు. అదే విధంగా ఇతర ఖైదీల మాదిరిగా ఆయనకు కూడా ఫార్మాలీటీజ్ చేసినట్లు తెలుస్తొంది. తాజాగా .. తమిళనటి.. కస్తూరీ శంకర్ కూడా తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను..చెన్నై పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఆమె తన జైలు జీవితం గురించి ఇటీవల ఒక మీడియాతో మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గామారింది. తనను జైల్లో న్యూడ్ గా.. లేడీ పోలీసులు చెక్ చేశారని.. ప్రైవేటు పార్ట్ లలో ఏదైన దాచోరో తెలుసుకునేందుకు గుంజీలు కూడా తీయించారని ఆమె చెప్పారు. అదేవిధంగా అల్లు అర్జున్ జైలులో తనలాగే అనుభవం ఎదురై ఉంటుందని ఆమె మాట్లాడారు.
అల్లు అర్జున్ కు బెయిల్ రావడం ఆలస్యమైంది. కాబట్టి.. ఆయనను కూడా.. జైలు రూల్స్ ప్రకారం.. ఆయనను కూడా.. న్యూడ్ గా చెక్ చేసి ఉంటారని నటి మాట్లాడారు. మనిషి పుట్టినప్పటి నుంచి ఎలా వచ్చామో... అలా నగ్నంగా నిలబెడతారని నటి వ్యాఖ్యలు చేసింది. చాలా ఉన్నతంగా ఉన్న వాళ్లు.. ఈ విధంగా ఈ సిట్యూవేషన్ చూసి షాక్ అయ్యుంటారని కూడా నటి కస్తూరీ శంకర్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అల్లు అర్జున్ ను ఇలాగే చెక్ చేసి ఉండోచ్చని ఆమె మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.