Telangana Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో ఫెంగల్ తుఫాను భయం తొలగిపోయింది. చెన్నై మీదుగా తీరం దాటడంతో కొన్ని ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం దీని ప్రభావం ఉండదు. కానీ చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. అంతేకాదు పొగ మంచు కారణంగా ఉదయం పూట వాహనాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు విపరీతంగా కమ్మేస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం పూట వాహనాలు డ్రైవ్ చేసేవారికి అలర్ట్ ప్రకటించింది. ఉదయం 9 గంటలక వరకు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
విపరీతమైన పొగ మంచు కారణంగా వాహనాలకు ప్రమాదాల ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాదు రాగల మూడు రోజుల్లో ఈ వాతావరణంలో తీవ్రంగా పడిపోతాయని నాలుగు డిగ్రీలకు కూడా తక్కువగా నమోదవుతాయి అని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రధానంగా ఈశాన్య, ఉత్తర దిశల నుంచి చలిగాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణం మూడు రోజుల పాటు అలాగే ఉంటుంది... ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండి హెచ్చరించింది.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటినా కానీ భారీ వర్షాలను నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో స్కూల్లో కూడా సెలవులు మంజూరు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లకూడదని హెచ్చిరించారు.
ముఖ్యంగా తిరుపతి రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రభావం ఉంది. ప్రభావం తమిళనాడు పై కూడా ఉంటుంది. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి