1000 Crore Movies: ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త టార్గెట్ రూ. 1000 కోట్లు అని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి 2’ తో వెయ్యి కోట్ల క్లబ్ అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్, కల్కి వంటి కొన్ని చిత్రాలే ఈ ఫీట్ ను అందుకున్నాయి. తాజాగా అల్లు అర్జున్, సుక్కు కలయికలో వచ్చిన ‘పుష్ప 2’ వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.
ప్రస్తుతం తెలుగు సినిమా ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. హిందీ సినిమాలను వెనక్కి నెట్టి ప్యాన్ ఇండియా లెవల్లో రచ్చ లేపుతుంది. తాజాగా పుష్ప 2 .. రూ. 1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించి మరోసారి దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. తెలుగులో వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన 4వ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ఈ సినిమా కంటే ముందు వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన తెలుగు సహా ఇతర భాష చిత్రాల విషయానికొస్తే..
పుష్ప 2.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’ విడుదలైన 6 రోజుల్లోనే రూ. 1000 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించి సంచలనం రేపింది. అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ అందుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. రాబోయే రోజుల్లో పుష్ప 2 ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
కల్కి 2898 AD.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1101 కోట్ల వరకు రాబట్టింది. తెలుగులో వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన మూడో తెలుగు చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
RRR.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గన్ హీరోలుగా రాజమౌళి హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘RRR’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1303 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టిన రెండో తెలుగు చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
బాహుబలి 2.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి 2’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. తెలుగులో రూ. వెయ్యి కోట్ల రాబట్టిన తొలి చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
కేజీఎఫ్ 2.. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ 2’. ఈ సినిమా రూ. 1233 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కన్నడలో తొలి వెయ్యి కోట్ల రూపాయలను రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.దక్షిణాది నుంచి మూడో తెలుగు చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
దంగల్.. ఆమీర్ ఖాన్ హీరోగా నితిష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దంగల్’. ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. ఈ సినిమా ఓవరాల్ గా మన దేశంతో పాటు చైనాతో కలిసి రూ. 1958 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
పఠాన్.. షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పఠాన్’. ఈ సినిమా మన దేశంలో తొలి వెయ్యి కోట్లు రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా రూ. 1051 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
జవాన్.. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘జవాన్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1160 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా హిందీలో మన దేశంలో రెండో వెయ్యి కోట్ల చిత్రంగా రికార్డులకు ఎక్కింది.