Smriti Mandhana World Record: స్మృతి మంధాన దెబ్బకు రికార్డులు చెల్లాచెదురు.. ఈ క్యూటీ బ్యాటింగ్‌ రేంజ్ అలా ఉంటుంది మరి

Ind Vs Aus ODI Women: వన్డే క్రికెట్లో స్మృతి మంధాన దెబ్బకు రికార్డులన్నీ చెల్లాచెదురయ్యాయి. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ క్యూటీ. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడోవన్డేలో ఈ ఘనతను సాధించింది. 
 

1 /6

Ind Vs Aus ODI Women: భారత డాషింగ్ మహిళా  బ్యాటర్ స్మృతి మంధాన దుమ్మురేపింది. మహిళా క్రికెట్లో వరల్డ్ రికార్డను నెలకొల్పి శభాష్ అనిపించింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో  స్మృతి మంధాన ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచులో సెంచరీ (109 బంతుల్లో 105, 14 ఫోర్లు, 1 సిక్సర్ ) సాధించి మంధాన ఎవరికీ సాధ్యం కానీ రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఒక క్యాలెండర్ ఇయర్ లో  అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యార్ గా రికార్డు క్రియేట్ చేసింది.

2 /6

 మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 8000 పరుగులను పూర్తి చేసింది. మంధాన ఇప్పుడు అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలుగా  రికార్డుల్లోకి ఎక్కింది. కేవలం 28 ఏళ్ల 146 రోజుల వయసులో స్మృతి ఈ ఘనత సాధించింది. 2024లో వన్డే ఫార్మాట్‌లో స్మృతి మంధానకు ఇది నాలుగో సెంచరీ.  

3 /6

బెలిండా క్లార్క్,  మెగ్ లానింగ్ వంటి చాలా మంది దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టింది.  స్మృతి మంధాన కెరీర్‌లో ఇప్పటివరకు 91 వన్డేల్లో 3812 పరుగులు చేసి, 145 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 3568 పరుగులు చేసింది. ఇది కాకుండా, మంధాన తన కెరీర్‌లో ఇప్పటివరకు 7 టెస్ట్ మ్యాచ్‌లు కూడా ఆడింది. అందులో ఆమె 629 పరుగులు చేసింది.   

4 /6

ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయంపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తన ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. బౌలింగ్ లో రాణించామని..ముఖ్యంగా అరుంధతి మంచి ఫెర్మామెన్స్ చూపించిందని చెప్పింది.   

5 /6

ఈ టూర్‌లో తను  బౌలింగ్,  బ్యాటింగ్ చేసిన విధానం నుండి మనం చాలా నేర్చుకోవాలి. మేము తిరిగి వెళ్లి మొత్తం పర్యటనను విశ్లేషిస్తాము. మేము ఎక్కడ తప్పు చేశామో అర్థం చేసుకుంటాము.   

6 /6

స్మృతి ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంది. మేము కొన్ని చోట్ల మంచి ప్రదర్శన కనబరిచాము, కానీ మేము మా జోరును కొనసాగించలేకపోయాము. భవిష్యత్తులో మేము మరింత కష్టపడాలి అని హర్మన్ ప్రీత్ అన్నారు.