Chia Seeds Remedies: ఈ సీడ్స్ తీసుకుంటే చాలు అధిక బరువు, చర్మ సమస్యలకు చెక్

ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్య సంరక్షణతో పాటు వెయిట్ లాస్, స్కిన్ కేర్‌కు దోహదం చేసే గుణాలు పెద్దఎత్తున ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది చియా సీడ్స్. బరువు నియంత్రణతో పాటు చర్మ సంరక్షణకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖంపై మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తొలగించడంలో చియా సీడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. చియా సీడ్స్‌తో కలిగే పూర్తి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

Chia Seeds Remedies: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్య సంరక్షణతో పాటు వెయిట్ లాస్, స్కిన్ కేర్‌కు దోహదం చేసే గుణాలు పెద్దఎత్తున ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది చియా సీడ్స్. బరువు నియంత్రణతో పాటు చర్మ సంరక్షణకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖంపై మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తొలగించడంలో చియా సీడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. చియా సీడ్స్‌తో కలిగే పూర్తి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1 /5

హైడ్రేట్  చియా సీడ్స్ విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అత్యధికంగా నీటిని గ్రహిస్తుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, .యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ముఖంపై గీతలు, డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. ఇందులో అద్భుతమైన మాయిశ్చరైజింగ్ గుణాలుంటాయి.

2 /5

కొలాజెన్ ఉత్పత్తిలో కొలాజెన్ అనేది చర్మానికి కావల్సిన కీలకమైన ప్రోటీన్. ఇది చర్మం ఎలాస్టిసిటీ, ఫర్మ్‌నెస్, ఏజీయింగ్ కొనసాగేలా చేస్తుంది. ఇందులో ఉండే 9 ఎమైనో ఆసిడ్స్ ముఖ్యంగా జింక్, విటమిన్ ఇ, విటమిన్ సి, కారణంగా కొలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ముఖం రంగు మెరుగుపడుతుంది

3 /5

ఫ్రీ రాడికల్స్ దూరం కాలుష్యం, దుమ్ము ధూళి కారణంగా ముఖంపై వ్యర్ధాలు పేరుకుపోతాయి. దాంతో ముఖంపై దురద, యాక్నే వంటి సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా చర్మం కణాల్ని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఇందుకు దోహదం చేస్తాయి

4 /5

స్వెల్లింగ్ దూరం చియా సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పెద్దఎత్తున ఉంటాయి.  ఇవి ముఖంపై స్వెల్లింగ్ సమస్యను తగ్గిస్తాయి. దాంతోపాటు హెల్తీ బ్యాక్టీరియాను పెంచుతుంది. చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. వారంలో రెండు సార్లు చియా సీడ్స్ మాస్క్ అప్లై చేస్తే మంచి ఫలింతాలుంటాయి.

5 /5

యూవీ కిరణాల నుంచి రక్షణ సూర్యుని నుంచి వెలువడే యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. యూవీ కిరణాలు ప్రీ మెచ్యూర్ ఏజియింగ్‌ను పెంచుతుంది. చర్మ కణాల్ని మెరుగుపర్చుతుంది. చియా సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, పోలీఫెనోలిక్ , జింక్ గుణాలుంటాయి.