M4M: సెన్సేషనల్ కాన్సెప్ట్‌తో రాబోతున్న M4M.. ప్రత్యేకత ఏమిటంటే..!

M4M release date: సరికొత్త కాన్సెప్ట్లను ఎప్పుడు ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు ఇదే రూట్ ఫాలో అవుతూ..మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో, జో శర్మ (యూఎస్ఏ) ప్రధాన పాత్రలో.. రాబోతో ఉన్న పాన్ ఇండియా చిత్రం 'ఎంఫోర్ఎం' (M4M - Motive For Murder) విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా గురించి ఈ చిత్ర యూనిట్.. ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 1, 2024, 11:43 AM IST
M4M: సెన్సేషనల్ కాన్సెప్ట్‌తో రాబోతున్న M4M.. ప్రత్యేకత ఏమిటంటే..!

M4M update: మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో, జో శర్మ (యూఎస్ఏ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'ఎంఫోర్ఎం' (M4M - Motive For Murder) విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం గురించి మోహన్ వడ్లపట్ల ఆసక్తికరమైన.. విషయాలను వెల్లడించారు. 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ ప్రయత్నించని వినూత్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించామని తెలిపారు. పది సంవత్సరాల పాటు ఈ సినిమా గురించి చర్చించుకుంటారని.. చెప్పడం విశేషం.  

గోవాలో జరిగిన ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) ఫిల్మ్ ఫెస్టివల్‌లో హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌ను ఆధారంగా తీసుకుని ప్రేక్షకులను ఉత్కంఠతకు గురిచేయనున్నట్లు దర్శకుడు తెలిపారు.  

జో శర్మ మాట్లాడుతూ, మోహన్ వడ్లపట్ల తనకు గొప్ప అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగుతుందని, ప్రేక్షకులు ఊపిరి బిగపట్టే అనుభూతి పొందుతారని చెప్పారు.  

ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందింది. త్వరలోనే ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

కాగా ఈ చిత్రంలో జో శర్మ (యూఎస్ఏ), సంబీత్ ఆచార్య, శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.  కథ, దర్శకత్వం...మోహన్ వడ్లపట్ల అందించిన ఈ చిత్రానికి.. వసంత్ ఇసాయిపెట్టై సంగీతం అందించారు. శ్రీచక్ర మల్లికార్జున  డైలాగ్స్ రాయగా.. పవన్ ఆనంద్ ఎడిటింగ్.. కొత్తపల్లి ఆది  వి.ఎఫ్.ఎక్స్ అందించారు.

ఈ చిత్రంలో ఎంఫోర్ఎం కథాంశం, సీరియల్ కిల్లర్ అంశం ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇవ్వడం.. ఖాయంలా కనిపిస్తోంది.

Also Read: RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్‌ ప్రజలకు తెలుసు'

Also Read: Deeksha Diwas: కేసీఆర్ హిమాలయమైతే.. రేవంత్‌ రెడ్డి ఆయన కాలిగోటికి సరిపోడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News