DRDO Recruitment 2024: ప్రభుత్వ రంగ డీఆర్‌డీఓ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏ రాత పరీక్ష లేకుండానే ఏకంగా లక్ష రూపాయల జీతం పొందే అవకాశం. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
DRDO Recruitment 2024: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ ప్రభుత్వ రంగ కంపెనీ పలు పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగుకు ఇది బంపర్ ఆఫర్. ఈ పోస్టులకు సంబంధించిన ఖాళీలు దరఖాస్తు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.
డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 35 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన చివరి తేదీ, అర్హత పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ రంగ ఆర్గనైజేషన్ డీఆర్‌డీఓ 11 సీనియర్ ఫెలోషిప్, 19 డీఆర్‌డీఓ ఫెలోషిప్, 5 చైర్ పోస్టులకు సంబంధించిన భర్తీ చేపట్టింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఉండాల్సిన అర్హత ఇతర వివరాలు తెలుసుకుందాం.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా బీటెక్ లేదా బీఈలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఏయిరోస్పేస్, లైబ్రరీ సైన్స్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు అభ్యర్థులు సంబంధిత డిగ్రీలో అప్రెంటిషిప్ కూడా పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్లు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఏజ్ రిల్యాక్సేషన్ సదుపాయం కూడా ఉంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో క్షుణ్నంగా పరిశీలించండి. పూర్తి వివరాలను డీఆర్‌డీఓ పర్సనల్ న్యూఢిల్లీ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
డీఆర్‌డీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. మెరీట్ ఆధారంగా అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లక్ష 25 వేలు ప్రతి నెలా సీనియర్ ఫెలోషిప్ పోస్టుకు, లక్ష రూపాయలు ఫెలోషిప్ పోస్టుకు అందుకుంటారు.