Hero Sai Durga Tej Emotional With His Mama Pawan Kalyan: తనకు గురువుగా చెప్పుకునే తన మేనమామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ సమావేశమయ్యాడు. సినిమాల్లోకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా తన మామయ్యను కలిసి ముచ్చటింగి భావోద్వేగానికి లోనయ్యాడు.
పదేళ్ల సంబరం: సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ సినీ పరిశ్రమలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ వేడుకను ప్రత్యేకంగా సాయి చేసుకున్నాడు.
ప్రియాతిప్రియమైన: తనకు ఎంతో ఇష్టమైన.. తనకు గురువు.. మామ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సాయి సమావేశమయ్యాడు.
ఆశీస్సులు: వెండి తెరపైకి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా తన మేనల్లుడు సాయిని మేనమామ ఆశీస్సులు అందించాడు.
కాళ్లు మొక్కడం: పవన్ కల్యాణ్‌కు పాదాభివందనం చేయగా.. పవన్ సాయికి శాలువా కప్పి కొన్ని జ్ఞాపికలు అందించారు.
ప్రత్యేక చర్చ: కొన్ని నిమిషాల పాటు వీరిద్దరూ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారని సమాచారం. ఏపీలో పరిస్థితులు.. సాయి సినిమాల విషయాలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక జ్ఞాపకం: తన మామయ్యతో గడిపిన క్షణాలను సాయి తన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. 'ఈ ప్రత్యేక జ్ఞాపకం నా గుండెలో ఎప్పటికీ నిలిచిపోతుంది. నా గురువు.. మామ.. నా సేనాని ఆశీర్వాదం పొందా' అని సాయి దుర్గా తేజ్ పంచుకున్నాడు.