Hyderabad Water Supply: హైదరాబాద్ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

Hyderabad Water Supply Shutdown: హైద‌రాబాద్ న‌గ‌రంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నగరానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లో క‌ల‌బ్ గూర్ నుంచి ప‌టాన్ చెరు వ‌ర‌కు ఉన్న 1500 ఎంఎం డ‌యా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు భారీ లీకేజీలు ఏర్ప‌డ్డాయి. ఈ లీకేజీల‌ను అరిక‌ట్టేందుకు సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల‌ నుంచి మ‌రుస‌టి రోజు అన‌గా మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. 
 

1 /5

24 గంట‌లు కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో లో ప్రెజ‌ర్‌తో నీటిస‌ర‌ఫ‌రా, మ‌రికొన్ని ప్రాంతాల్లో స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం కలుగుతుందని అధికారులు వెల్లడించారు.  

2 /5

ఓ అండ్ ఎం డివిజ‌న్ 15- ఆర్సీ పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్.  

3 /5

ఓ అండ్ ఎం డివిజ‌న్ 24 - బీరంగూడ‌, అమీన్ పూర్.. ==> ట్రాన్స్ మిష‌న్ డివిజ‌న్ 2 - ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్ష‌న్లు.  

4 /5

ఓ అండ్ ఎం డివిజ‌న్ 6 - ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట్. ==> ఓ అండ్ ఎం డివిజ‌న్ 9 - కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, మూసాపేట్, జ‌గ‌ద్గిరిగుట్ట‌.  

5 /5

పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.