Borugadda Anil Biryani Viral Video : బోరుగడ్డ అనీల్‌కు పోలీసులు రాచమర్యాదలు చేశారు. ప్రస్తుతం ఆయనకు బిర్యానీ తినిపించడంతో ఆ వీడియో వైరల్ అవుతుంది. మంగళగిరి కోర్టుకు హాజరై వస్తుండగా పోలీసులు బోరుగడ్డకు ఈ రాచ మర్యాదలు చేశారు. బోరుగడ్డ పై ప్రస్తుతం 17 కేసులు ఉన్నాయి. సదరు పోలీసులపై పై అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న ఆ రెస్టారెంట్లో బిర్యానీ బాగుంటుందని బోరుగడ్డ అనీల్ పోలీసులను అడిగాడా? అసలు ఏం జరిగింది తెలియాల్సి ఉంది. కానీ, ఒక రాష్ట్ర సీఎంను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి, రిమాండ్ ఖైదీకి ఇలా సరదాగా పిక్నిక్ వెళ్తున్నట్లు రెస్టారెంట్లో బిర్యానీ తినిపించడానిపి పోలీసులు తీసుకువెళ్లడం సర్వత్రా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో విర్రవీగిపోయే బోరుగడ్డు అనీల్ సీఎం చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. ఒక వేళ బోరుగడ్డ అనీల్ తప్పించుకుని పోతే ఎలా? ఒక బిర్యానీ కోసం పోలీసులు బోరుగడ్డను రెస్టారెంట్‌కు తీసుకెళ్లడం మొత్తానికి సంచలనంగా మారింది.
రెస్టారెంట్‌లోని కొందరు ఆ వీడియో తీస్తున్న కొంతమంది నుంచి పోలీసులు ఫోన్ లాక్కొని, వీడియో డిలీట్ చేశారు. ఇది పోలీసులకు మొదటికే మోసం చేసింది. ఇలా హుందాగా బోరుగడ్డ తిరిగిన క్రమంలో ఎవరైనా బోరుగడ్డపై దాడి చేస్తే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. జనసైనికులు కూడా పోలీసుల తీరుకు మండిపడుతున్నారు. కుటుంబ సభ్యుల్లగా బోరుగడ్డకు విందు భోజనం పెట్టడం ఏంటి అని దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వ వర్గాల్లో ఎవరు బోరుగడ్డకు ఇలా సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బోరుగడ్డ అనీల్‌కు బిర్యానీ అని ట్రెండ్ అవుతోంది. రెస్టారెంట్లో బోరుగడ్డకు సకల మర్యాదలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. దర్జాగా బోరుగడ్డ రెస్టారెంట్లోకి నడుస్తూ వెళ్తున్న వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. టీడీపీ, జనసేన కార్యకర్తలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.
జిల్లా ఎస్పీ, జైళ్ల శాఖకు సంబంధించిన అధికారులు సదరు పోలీసులపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పోలీసులపై వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. గన్నవరం క్రాస్‌రోడ్డు రెస్టారెంట్లో అనీల్‌కు పోలీసులు బిర్యానీ తినిపించారు. సీఎం చంద్రబాబు, లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఇష్టం వచ్చినట్లు తిట్టిన బోరుగడ్డకు ఇలా పోలీసులు రాచమర్యాదలు ఏంటి అని పెదవి విరుస్తున్నారు చూసిన వారు. ఏపీ మొత్తం సోషల్ మీడియా లైవ్ నిర్వహించే బోరుగడ్డకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. వంద రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగారు. ఆ తర్వాత అనీల్‌ను అరెస్టు చేశారు. వివిధ కేసుల్లో ఆయన జైలుకు వెళ్తు వస్తున్నారు. మొత్తంగా ఆయన్ని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: బొప్పాయి ఫేస్‌మాస్క్‌తో బోలెడు ప్రయోజనాలు.. హిరోయిన్ మించిన అందం మీ సొంతం..
ఇదీ చదవండి: ఈ 3 ఇంటి చిట్కాలతోనే తెల్ల వెంట్రుకల సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.