Raw Banana Benefits: పచ్చి అరటి తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు, డయాబెటిస్‌కు సైతం చెక్

అరటి అనేది ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. ఇందులో చాలా రకాల పోషక పదార్ధాలు ఉంటాయి. చౌక ధరకు లభించే అద్భుతమైన న్యూట్రిషన్ ఫుడ్. పచ్చి అరటి ఆరోగ్యానికి ఇంకా మంచిది. పచ్చి అరటి తింటే 5 అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Raw Banana Benefits: అరటి అనేది ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. ఇందులో చాలా రకాల పోషక పదార్ధాలు ఉంటాయి. చౌక ధరకు లభించే అద్భుతమైన న్యూట్రిషన్ ఫుడ్. పచ్చి అరటి ఆరోగ్యానికి ఇంకా మంచిది. పచ్చి అరటి తింటే 5 అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

1 /5

డయాబెటిస్‌కు చెక్ పచ్చి అరటిలో షుగర్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచేందుకు దోహదం చేస్తుంది. పచ్చి అరటి గ్లైసెమిక్ ఇండెక్స్ 30 ఉంటుంది. అందుకే ఇది మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది

2 /5

జీర్ణక్రియ  పచ్చి అరటిలో బౌండ్ ఫెనోలిక్స్ పెద్దఎత్తున ఉంటాయి. ఇవి ప్రో బయోటిక్ ఎఫెక్ట్ కల్గిస్తాయి. దాంతో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

3 /5

యాంటీ ఆక్సిడెంట్లు పచ్చి అరటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. ఫలితంగా కేన్సర్ ముప్పు తగ్గుతుంది. ఆక్సిడేటివ్ డ్యామేజ్ ముప్పు తగ్గుతుంది

4 /5

బరువు నియంత్రణ చాలామంది బరువు తగ్గించాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోతుంటారు. అయితే పచ్చి అరటి తింటే ఇందులో ఉండే ఫైబర్ కారణంగా క్రమ క్రమంగా బరువు తగ్గించుకోవచ్చు.

5 /5

గుండె ఆరోగ్యం ఆరటిలో ఉండే పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో కూడా పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. హార్ట్ బీట్ కూడా క్రమబద్ధీకరిస్తుంది