KA Climax: దీపావళికి విడుదలైన మూడు సినిమాలు కూడా.. మంచి విజయాలు సాధించాయి. ఈ మూడు సినిమాలలో ముఖ్యంగా లక్కీ భాస్కర్, క చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక క సినిమా క్లైమాక్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం చర్చ జరుగుతోంది.
సినిమా మొత్తం ఎలా ఉన్నా పరవాలేదు.. సినిమా క్లైమాక్స్ బాగోలేకపోతే మాత్రం.. థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు.. ఆ చిత్రం తప్పకుండా గుర్తుండదు. అదే క్లైమాక్స్ బాగుంటే.. సినిమా మొత్తం బాగా లేకపోయినా.. చివరిగా ఒక సంతోషమైన ఫీలింగ్ తోనే బయటకు వస్తాం. ఇదే అక్షరాల రుజువు చేసింది క సినిమా. ఫిదా, సీతారామం…ఇలా ఎన్నో సినిమాలు.. క్లైమాక్స్ వల్ల బ్లాక్ బస్టర్ సాధించినవే. ఇప్పుడు అదే కోవలోకి చేరింది క చిత్రం.
అయితే క చిత్రం అంత గొప్ప సినిమా అనేది మనకి క్లైమాక్స్ వరకు ఎక్కడ అనిపివ్వదు. సినిమా క్లైమాక్స్ వరకు కూడా మనకు అక్కడక్కడ బోర్ కొట్టిస్తూనే ఉంటుంది. నిజానికి క సినిమా.. ఎప్పుడో 1970లో వచ్చిన చిత్రంలానే అనిపిస్తుంది. అక్కడక్కడ ట్విస్టులు ఉన్న.. అవి కూడా మనం ముందుగా ఊహించగలిగినవే.
ఒక ఊరిలో అదృశ్యం అవుతున్న అమ్మాయిలు.. వాళ్ల వెనక ఒక మాఫియా.. వాళ్లను చివరిగా పట్టుకునే హీరో. ఇదంతా చాలా పాత కథే. కానీ దీనిని ప్రేక్షకులకు చెప్పడానికి దర్శకుడు తీసుకున్న మార్గం.. ఏమిటి అనేది క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది.
అప్పుడు ఒక్కసారిగా.. సినిమా మొత్తం తలుచుకుంటే.. సినిమా మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు మనకు ఎంతగానో నచ్చడం ఖాయం. అంటే క్లైమాక్స్ చూసాక క చిత్రం మరోసారి చూస్తే.. మనకు ముచ్చట వెయ్యడం ఖాయం అనే చెప్పాలి. అసలు అంతలా ఆకట్టుకునే విషయం ఈ క్లైమాక్స్లో ఏముంది అనేది.. సినిమా చూడని వారికి తప్పకుండా కలిగే ప్రశ్న.
అయితే ఈ ప్రశ్నకి సమాధానం..సినిమా చూసి తెలుసుకోవడమే బాగుంటుంది. కానీ ఈ సినిమా క్లైమాక్స్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే..అమ్మ కడుపులో బిడ్డ జీవం ఎలా పోసుకుంటుంది.. గర్భంలో ఉన్నప్పుడు జరిగే సంఘటనలు ఏమిటి అనే విషయాన్ని.. ఈ సినిమా కథతో ముడిపెట్టి దర్శకుడు తీసిన తీరు చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది.
అసలు దర్శకుడికి ఈ ఆలోచన రావడం ఎంతో అభినందనీయం. తెలుగులో ఎన్నో గొప్ప చిత్రాలు.. ఎన్నో గొప్ప క్లైమాక్స్ లు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ లిస్టులోకి తప్పకుండా చేరిపోయింది క సినిమా. మీరు టికెట్ పెట్టుకుని ఈ సినిమాని చూసినప్పుడు.. లాస్ట్ పది నిమిషాల వరకు.. అసలు ఎందుకు ఈ చిత్రాన్ని ఇంతలా మెచ్చుకున్నారు అని రివ్యూలు ఇచ్చే వాళ్ళని తిట్టినా.. లాస్ట్ పది నిమిషాలు మాత్రం మీరు తప్పకుండా ఆ ఉద్దేశం నుండి బయటకు వచ్చేస్తారు.