8th Pay Commission: ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘంతో ఉద్యోగుల జీతభత్యాలు ఎంత పెరుగుతున్నాయంటే

8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలకమైన అప్‌డేట్ వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం ఎంత పెరుగుతుందో చెక్ చేద్దాం.

8th Pay Commission Salary Hike in Telugu: 8వ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే. భారీగా కనీస వేతనం పెరగనుంది. కనీస వేతనం ఏకంగా రెట్టింపు కానుంది. 18 వేల రూపాయలు కాస్తా 34,560 రూపాయలు అవుతుంది. అటు పెన్షనర్ల పెన్షన్ కూడా 17,280 రూపాయలు కానుంది. 8వ వేతన సంఘం గురించి కీలకమైన అప్‌డేట్ ఇది.

1 /8

కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2016లో పెంచింది. అంటే 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు. ఫలితంగా 48.62 లక్షలమంది ఉద్యోగులు, 67.85 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలిగింది. 

2 /8

8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కనీస వేతనం 18 వేల నుంచి 34,560 రూపాయలు అంటే 92 శాతం పెరుగుతుంది. అటు పెన్షన్ కూడా 17,280 రూపాయలు కానుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా 2.57 శాతం నుంచి 3.68 శాతానికి పెరగనుంది. అంటే ఉద్యోగుల జీతం 20 వేల నుంచి 25 వేలు కావచ్చు. 

3 /8

వేతన సంఘం అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఓ కమిటీ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్ సమీక్షించడం, అవసరమైన సవరణలు చేయడం ఈ కమిటీ లక్ష్యం. ద్రవ్యోల్బణం, ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు సూచిస్తుంది. 

4 /8

ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడుతుంటుంది. 7వ వేతన సంఘం 2014 ఫిబ్రవరిలో ఏర్పడగా 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. 7వ వేతన సంఘం 2025 డిసెంబర్ 31కు గడువు పూర్తి కానుంది. జనవరి 2026 నుంచి కొత్తగా 8వ వేతన సంఘం అమల్లోకి రావల్సి ఉంది. 

5 /8

8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18 వేల రూపాయల నుంచి 34,560 రూపాయలకు పెరగనుంది. అంటే రెట్టింపు కానుంది. ఇక పెన్షన్ కూడా 17,280 రూపాయలు అవుతుంది. ఈ నెలలోనే జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ సమావేశం కూడా జరగనుంది.

6 /8

వచ్చే ఏడాది 2025 ప్రారంభంలో మోదీ ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతం, పెన్షనర్ల పెన్షన్ భారీగా పెరగనుంది. 

7 /8

మరోవైపు 8వ వేతన సంఘం వచ్చే ఏడాది 2025 లో ఏర్పాటు కానుంది. ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడుతుంది. 2014లో ఏర్పడిన 7వ వేతన సంఘం 2016 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే 2025లో 8వ వేతన సంఘం ఏర్పడితే 2026 నాటికి అమల్లోకి రావచ్చు. 

8 /8

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే 7వ వేతన సంఘం ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ 3 శాతం పెంచింది. అటు పెన్షనర్లకు డీఆర్ కూడా అంతే పెరిగింది. దాంతో మొత్తం డీఏ లేదా డీఆర్ 50 నుంచి 53 శాతమైంది. మరో డీఏ 2025 జనవరిలో పెరగాల్సి ఉంది.