Cholesterol: ఇది కొలెస్ట్రాల్‌ చివరి చుక్కను గ్రహించేస్తుంది.. మీ ఇంట్లో నిత్యం అందుబాటులో ఉంటుంది..

Cholesterol Control Tips: కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువైతే గుండె సమస్యలు వస్తాయి. ఇది ప్రాణాంతక పరిస్థితికి కూడా దారితీస్తుంది. కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉండాలంటే మీ డైట్‌ సరిగ్గా ఉండాలి. మీ ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతో కూడా కొలెస్ట్రాల్‌ సింపుల్‌గా తగ్గించుకోవచ్చు. 
 

1 /7

మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే గుండె సంబంధిత ప్రాణాంతక సమస్యలు వస్తాయి. అందుకే మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుకోవాలి.  

2 /7

మన ఇంట్లో టమోటాలు నిత్యం అందుబాటులో ఉంటాయి. ఇందులో ముఖ్యంగా లైకోపీన్‌ ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇది గుండె సమస్యలు మీ దరిచేరకుండా కాపాడుతుంది.  

3 /7

అంతేకాదు టమోటాల్లో విటమిన్ ఏ, సీ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించేస్తాయి. ఇవి ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి.  

4 /7

వైద్యుల ప్రకారం టమోటాలు డైట్‌లో  చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటాయి. మీకు ఇది సులభంగా ఇంట్లో అందుబాటులో ఉండే ఆహారం కాబట్టి కొలెస్ట్రాల్‌  ఉన్నవారు టమోటాలు తినాలి.  

5 /7

టమోటాలతో రకరకాల వంటకాలు తయారు చేస్తాం. ముఖ్యంగా కూరలు, సలాడ్‌లు తయారు చేసుకుంటాం. వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవాలి. ఇది కాకుండా బ్యూటీ రొటీన్‌లో కూడా టమోటాలు వినియోగిస్తారు.  

6 /7

మన శరీరంలో మనం తీసుకునే ఆహారం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు నియంత్రించాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అవి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.  

7 /7

వీలైనంత వరకు ఎక్కువ శాతం పండ్లు కూరగాయలు, ముఖ్యంగా సీట్రస్‌ ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి. వీటి వల్ల కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటాయి.