Nara Lokesh Red Book: ఈరోజు ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్‌లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. అమెరికా టూర్లో తాను ఏ దిగ్గజ కంపెనీ దగ్గరకు వెళ్లినా.. చంద్రబాబు పేరు చెప్పగానే రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికారని తెలిపారు. సీబీఎన్ బ్రాండ్‌తోనే తాను ఫార్చూన్ 500 కంపెనీలకు వెళ్లి పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు వివరించారు. తెలుగు వారు తలెత్తుకొని తిరుగుతున్నారంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్ అని.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు.
దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకే సొంతం అని నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వంలో చేయని తప్పుకు చంద్రబాబు నాయుడిని జైలుతో బంధిస్తే.. ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా ఆందోళనలు చేశారని గుర్తుచేశారు. "రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేందుకు తాను వారం రోజుల నుంచి అమెరికాలో ఇన్వెస్టర్లను కలుస్తున్నా.. కానీ ఈ రోజు మీ అందరినీ చూసిన తరువాత నాకు కిక్ వచ్చింది. మిమ్మల్ని అందరూ ఎన్ఆర్ఐ అని పిలుస్తారు. నేను మాత్రం ఎమ్ఆర్ఐ అంటాను. అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు సంపాదించిన రూపాయిలో 10 పైసలు సొంతగడ్డ కోసం ఖర్చు పెడుతున్నారు." అని నారా లోకేష్ అన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రానివిధంగా ఈసారి కూటమి అభ్యర్థులకు మెజారిటీలు వచ్చాయని.. రాష్ట్ర ప్రజలంతా సైకోని తరిమికొట్టాలని కంకణం కట్టుకోవడంతోనే ఈ ఘన విజయం సాధ్యమైందని మంత్రి లోకేష్ అన్నారు. ఎన్నికల్లో 175కి 175 అన్నవారి ముఖాలు మాడిమసైపోయాయని.. ఈ గెలుపు ప్రపంచంలో ఉన్న తెలుగువారందరిదన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం నాశనమైందని.. అందరినీ సైకో ఇబ్బందిపెట్టాడని ఫైర్ అయ్యారు. తన పాదయాత్రకు అడుగడుగునా ఇబ్బందులకు గురిచేశారని.. ఆ రోజే తాను రెడ్ బుక్ గురించి చెప్పానని అన్నారు. ఇప్పుడు జగన్ గుడ్‌బుక్ తెరుస్తాడంట.. నోట్ బుక్ చదవడమే రాదు ఇక గుడ్‌బుక్ ఏం రాస్తాడని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం రెడ్ బుక్‌లో ఒక చాప్టర్ అయిపోయిందని.. రెండోది ఓపెన్ అయిందన్నారు. మూడో చాప్టర్ త్వరలో తెరబోతున్నానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు వారి కూర్చీలను మడతబెట్టారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు తలుచుకుంటే రెండు నిమిషాల్లో వారిని లోపల వేస్తారని అన్నారు. కానీ ప్రజలు ఇచ్చిన అఖండ విజయంతో హుందాతనంగా వ్యవహరించాలని.. గాడితప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పద్ధతి ప్రకారం రెడ్ బుక్ అమలు చేస్తామని.. తాను తగ్గేదే లేదన్నారు. పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టినవారికి సినిమా చూపించే బాధ్యత తనదేనన్నారు.
Also Read: Rahu Mahadasha: రాహు మహాదశ ఈ రాశికి 18 ఏళ్లు రాజభోగాలు.. లక్షాధికారి అయ్యే బంపర్ ఛాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.