Gold News Today: తగ్గేదెలే అంటున్న బంగారం..82 వేలు దాటిన తులం పసిడి

Gold News Today:  బంగారం ధర దీపావళి తారాజువ్వలా ఆకాశాన్ని తాకింది. అందరి ఊహలను పటాపంచలు చేస్తూ బంగారం ధర 82,000 దాటిపోయింది. ఇక పసిడి ముట్టుకుంటేనే షాక్ అనే పరిస్థితికి చేరుకుంది. బంగారం ధర ఈ రేంజ్ లో పెరగడం చరిత్రలోనే మొదటిసారి అని చెప్పవచ్చు. నవంబర్ ఒకటో తారీకు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Nov 1, 2024, 09:11 AM IST
Gold News Today: తగ్గేదెలే అంటున్న బంగారం..82 వేలు దాటిన తులం పసిడి

Gold News Today: బంగారం ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. నేడు పసిడి ధరలు మరో రికార్డును సృష్టించాయి. పసిడి ధరలు వేగంగా దూసుకెళ్తున్నాయి. నవంబర్ ఒకటో తేదీ శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,150 రూపాయలుగా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,550 రూపాయల గా ఉంది. 

బంగారం ధరలు ప్రధానంగా పెరగడానికి ముఖ్య కారణం ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. బంగారం ధరకు దేశీయంగా కూడా పెరగడానికి అటు ఫెస్టివల్ సీజన్ కూడా ఒక కారణం. దీనికి తోడు అమెరికాలో ప్రస్తుతం ఒక ఔన్సు బంగారం ధర 2800 డాలర్లు దాటింది. దీంతో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. 

పసిడి ధరలు ఈ రేంజ్ లో పెరగడం చరిత్రలోనే ఇది తొలిసారి అని చెప్పవచ్చు బంగారం ధర నేడు తొలిసారిగా 82,000 దాటింది. నిన్నటితో పోల్చితే బంగారం ధర దాదాపు 300 రూపాయలు పెరిగింది. ఈ సంవత్సరం బంగారం ఆభరణాల సేల్స్ చాలా తగ్గాయని దుకాణదారులు పేర్కొంటున్నారు. గత ధన త్రయోదశి తో పోల్చితే ఈ సంవత్సరం బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో దాదాపు 30 శాతం సేల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది. 

బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అటు పసిడి ప్రియులు కూడా బంగారం కొనుగోలు చేసేందుకు వెనక్కు తగ్గుతున్నారు. అయితే బంగారం ధరలు ఇలాగే ఉంటాయా లేక భవిష్యత్తులో పెరుగుతాయా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి కానీ బంగారం ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇది మరింత జోరు అందుకునే అవకాశం ఉంది. 

Also Read: LPG Gas Cylinder: సామాన్యులకు పండుగ పూట బిగ్‌షాక్.. ఏకంగా రూ.2,028 చేరిన గ్యాస్‌ సిలిండర్‌..  

అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే బంగారం ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని లక్ష దాటడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో డోనాల్డ్ ట్రంప్ సాంప్రదాయానికి భిన్నంగా క్రిప్టో కరెన్సీ లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అమెరికా ఆర్థిక విధానంలో మార్పుల వల్ల బిట్ కాయిన్ వంటి డిజిటల్ అసెట్స్ కు డిమాండ్ ఏర్పడుతుంది. 

ఈ పరిణామాల నుంచి సేఫ్ గా ఉండేందుకు ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భవిష్యత్తులో మాత్రం బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్లు మంచి ప్రత్యామ్నాయమని చెప్తున్నారు.

Also Read: Rahu Mahadasha: రాహు మహాదశ ఈ రాశికి 18 ఏళ్లు రాజభోగాలు.. లక్షాధికారి అయ్యే బంపర్‌ ఛాన్స్‌!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News