IPL 2025 Teams Purse: బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ 2025 కోసం సిద్ధమయ్యే 10 ఫ్రాంచైజీలు ఇవాళ అక్టోబర్ 31లోగా ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా విడుదల చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం గరిష్టంగా ఆరుమందిని ఉంచుకోవచ్చు. అదే విధంగా మొత్తం ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఎవరిని ఎంతకు రిటైన్ చేసుకున్నాయో , ఇంకా ఎంత మిగిలిందో వెల్లడించాయి.
ఈసారి జరగనున్న ఆక్షన్‌లో ఐపీఎల్ మెగా ప్లేయర్లు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమిలు వేలంగా కన్పించనున్నారు. మరి ఈ ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ ఎంతకు దక్కించుకుంటుందో చూడాలి.
చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 55 కోట్లు
ముంబై ఇండియన్స్ 45 కోట్లు
ఢిల్లీ కేపిటల్స్ 76.25 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ 63 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 83 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్ 69 కోట్లు
పంజాబ్ సూపర్ కింగ్స్ 110.5 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ 45 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ 41 కోట్లు
గుజరాత్ టైటాన్స్ 69 కోట్లు
ఈసారి వేలంలో అత్యధికంగా 11.5 కోట్లతో పంజాబ్ సూపర్ కింగ్స్ బరిలో దిగనుంది. ఆ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 83 కోట్లతో వేలంలో పాల్గొననుంది. రిటెన్షన్‌లో అత్యధిక ధర పలికిన ప్లేయర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ 23 కోట్లు కాగా రెండు మూడు స్థానాల్లో విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్ 21 కోట్లతో ఉన్నారు.
Also read: SRH Retained List: ఆ ఐదుగురిపై అపార నమ్మకం పెట్టుకున్న కావ్య పాప, భారీ ధర చెల్లింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.