Fouja Movie: హిందీలో బ్లాక్‌బస్టర్.. త్వరలో తెలుగు ప్రేక్షకులు ముందుకు..!

Fouja Movie Telugu Version: హిందీలో మూడు నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఫౌజా మూవీ త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో స్పెషల్ షో ప్రదర్శించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Oct 28, 2024, 10:09 PM IST
Fouja Movie: హిందీలో బ్లాక్‌బస్టర్.. త్వరలో తెలుగు ప్రేక్షకులు ముందుకు..!

Fouja Movie Telugu Version: కార్తీక్ దమ్ము, ఐశ్వర్యా సింగ్, పవన్ మల్హోత్ర కీలక పాత్రల్లో ప్రమోద్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఫౌజా. అజిత్ దాల్మియా నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. హిందీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో స్పెషల్ షో ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో హీరో కార్తీక్ దమ్ము మాట్లాడుతూ.. తాను హైదరాబాద్‌లో పుట్టానని.. మళ్లీ ఇలా తన సినిమా కోసం ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు. సినిమాకి భాషా సరిహద్దులు ఉండవని.. త్వరలోనే ఫౌజా మూవీ తెలుగు, తమిళ ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నట్లు చెప్పారు. అందరూ మూవీని చూసి ఎంజాయ్ చేయాలన్నారు.

Also Read: Power Charges: తెలంగాణలో పేదలకు ఊరట.. మిడిల్‌ క్లాస్‌కు 'కరెంట్‌' షాక్‌

విజ‌య్ ధరన్  దాట్ల‌ మాట్లాడుతూ.. ఫౌజా సినిమా ఎప్పటికీ ఎవ‌ర్‌గ్రీన్‌గా నిలుస్తుందని.. మూడు నేష‌న‌ల్ అవార్డ్స్ వ‌చ్చాయని తెలిపారు. త్వరలోనే తెలుగులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ప్రొడ్యూసర్ అజిత్ దాల్మియా మాట్లాడుతూ.. ఫౌజా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. డైరెక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. మన వద్ద డబ్బులు ఎన్ని ఉన్నా.. బ్రాండెడ్ దుస్తులు కొనగలమని.. కానీ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్‌ను కొనలేమన్నారు. దాన్ని కష్టంతో ఇష్టంతో సాధించుకోవాలని.. దేశభక్తి ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. దేశం అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి ఫౌజా మూవీ నచ్చుతుందన్నారు. త్వరలోనే ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుందన్నారు. 

హర్యానా ప్రిన్సిపల్ సెక్రటరీ డా.డి.సురేష్ మాట్లాడుతూ.. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులు అందుకుందన్నారు. తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంతి డి.సురేష్ మాట్లాడుతూ.. ఈ మూవీని చూసే సమయంలో ప్రతి ఒక్కరు ఏడ్చారని అన్నారు. సినిమాకు భాష అడ్డంకి కాదని.. ఎమోషన్స్ ముఖ్యమన్నారు. ఫౌజా మూవీని చూసి అందరూ ఎంజాయ్ చేయాలని కోరారు. ఈ మూవీకి యుగ్ భూష‌ల్‌ మ్యూజిక్‌ అందించారు. సినిమాటోగ్ర‌ఫర్‌గా శ‌శాంక్ విరాగ్‌ వ్యవహరించగా.. ఎడిట‌ర్‌గా జితేంద్ర దొంగ్రే పనిచేశారు. 

Also Read: Bank Holidays: బ్యాంకులకు ఈ మూడు రోజులు సెలవు, ఎప్పుడెప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook

Trending News