NO OTP: నవంబర్ 1 నుంచి ఓటీపీ బాధలకు చెక్, ట్రాయ్ కొత్త ఆదేశాలు

NO OTP: వన్ టైమ్ పాస్‌వర్డ్...ఓటీపీ ప్రస్తుతం సాధారణమైపోయిది. ఎలాంటి ఆన్‌లైన్ లావాదేవీలు జరపాలన్నా ఓటీపీ తప్పనిసరిగా మారింది. ఓ వైపు ఓటీపీ షేర్ చేయవద్దని చెబుతూనే ఓటీపీ వినియోగం పెరిగిపోయింది. ఇక త్వరలో ఈ ఓటీపీ సమస్యకు చెక్ పెడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2024, 07:39 PM IST
NO OTP: నవంబర్ 1 నుంచి ఓటీపీ బాధలకు చెక్, ట్రాయ్ కొత్త ఆదేశాలు

NO OTP: ఆన్‌లైన్ షాపింగ్, బ్యాంకింగ్ లావాదేవీలు, ఆర్ధిక వ్యవహారాలు, సోషల్ మీడియా వేదికలు ఇలా అన్నింట్లో ఓటీటీ సర్వ సాధారణంగా మారింది. ఇక త్వరలో ఈ ఓటీపీ సమస్యకు చెక్ పడనుంది. నవంబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఓటీపీలను రద్దు చేయాలంటూ టెలీకం సంస్థకు ట్రాయ్ ప్రతిపాదనలు పంపింది. 

ట్రాయ్ కొత్త ప్రతిపాదనలను ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఈ నిబంధనలు అమలు చేయాల్సిందేనని ట్రాయ్ స్పష్టం చేయడంతో కనీసం గడువు ఇవ్వాలని కోరుతున్నాయి. ఓటీపీల వల్ల కస్టమర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారనేది ట్రాయ్ చెబుతున్న వాదన. వాస్తవానికి 2023 ఆగస్టులోనే వివిధ బ్యాంకులు, పైనాన్సింగ్ సంస్థల నుంచి వచ్చే ఓటీపీలను నియంత్రించాలని ట్రాయ్ ఆదేశించింది. కానీ అప్పట్నించి వాయిదా పడుతూ వస్తోంది. ఇక నవంబర్ 1 నుంచి విధిగా ఓటీపీ సేవలు బంద్ చేయాలని ఆదేశించింది. 

విదేశాలనుంచే కాకుండా దేశంలో కూడా సైబర్ నేరాలు పెరిగిపోతున్న క్రమంలో వాటిని అకరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చింది. త్వరలో ఇది పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. ట్రాయ్ కొత్త ఆదేశాల ప్రకారం ఓటీపీలు నియంత్రించగలిగితే స్కామర్లకు తాత్కాలికంగా చెక్ చెప్పినట్టవుతుంది. 

Also read: Venkatesh Second Marriage: విక్టరీ వెంకటేశ్ రెండో పెళ్లి..ఆ హీరోయిన్‌తో జరిగిందా, అసలేం జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News