Rats Away Best Tips: చాలామంది ఇళ్లలో ఎలుకలు ఉండడం సర్వసాధారణం.. అయితే ఇవి ఉండడంవల్ల వచ్చే సమస్యలు అన్నో ఇన్నో కావు.. ముఖ్యంగా కిచెన్ లో ఉండే వస్తువులను కోరికేయడమే కాకుండా.. మీరు పెట్టిన అల్మారులోకి దూరి కొత్త కొత్త దుస్తులను కూడా కొరికి తింటూ ఉంటాయి. అయితే ఇవి ఇళ్లలోకి చాలా సులభంగా వస్తాయి..కానీ తరిమి కొట్టడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. చాలామంది ఎలకలను ఇంట్లో నుంచి తరిమికొట్టేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ వాటిని వదిలించుకోలేకపోతారు. అంతే కాకుండా కొంతమంది అయితే డబ్బులు ఖర్చు పెట్టి మరి పెస్ట్ కంట్రోల్ వాళ్ళతో వాటిని పట్టిస్తున్నారు. అయినప్పటికీ ఎలుకలు ఇంట్లో నుంచి పోలేకపోతున్నాయి. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని రెమెడీస్ తో సులభంగా ఇంట్లో ఉన్న ఎలుకలు నుంచి విముక్తి పొందవచ్చు. ఈ రెమెడీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఎలకలను ఇంట్లో నుంచి పారిపోయేలా చేయడానికి ముందుగా ఇంటి ముందు ఒక చిన్న చెట్టును పెంచాల్సి ఉంటుంది. రోజ్ మేరీ ఆకులు కలిగిన చెట్టును ఇంటి ముందు నాటడం వల్ల దాని నుంచి వచ్చే సువాసనకు ఎలకలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఆ సువాసన ఇంట్లోకి చేరి ఇంట్లో ఉన్న ఎలకలను కూడా పారిపోయేలా చేస్తాయి. అలాగే ఈ చెట్టు ఉన్న పరిసర ప్రాంతాల్లోకి కూడా సంచారం చెయ్యవట. దీని నుంచి వచ్చే సువాసన వల్ల కూడా ఇతర క్రిమి కీటకాలు తొలగిపోతాయి..
ఇంటిముందు లావెండర్ మొక్కను పెంచడం వల్ల కూడా ఎలకలు ఇంట్లోకి రాకుండా ఉంటాయట. అంతేకాకుండా దీని నుంచి వచ్చే సువాసన ఎలుకలను పారిపోయేలా చేస్తుందట. అంతేకాకుండా ఈ లావెండర్ చిన్న మొక్కను ఇంటి ముందు నాటడం వల్ల కూడా బొద్దింకలు రాకుండా ఉంటాయట. అలాగే దీని నుంచి వచ్చే కొన్ని మూలకాలు ఎలకలను పూర్తిగా ఇంటి పరిసర ప్రాంతాల్లోకి రాకుండా కూడా చేస్తాయట. ఇవే కాకుండా ఈ మొక్క ఇంటి ముందు ఉండడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
బిర్యానీలోకి వాడుకునే పుదీనా మొక్కలను ఇంటి ముందు నాటడం వల్ల ఎలకలు రాకుండా ఉంటాయట. ఈ ఆకుల నుంచి వచ్చే వాసన ఎలుకలకు ఇరిటేటింగ్ చేస్తుంది. అంతేకాకుండా అక్కడి నుంచి పారిపోయేలా చేసేందుకు కూడా ఆకులు ఎంతగానో సహాయపడతాయట. కాబట్టి ఇంటి గుమ్మం ముందు పుదీనా మొక్కలు పెంచడం వల్ల సులభంగా ఎలుకల నుంచి విముక్తి పొందవచ్చు.
అలాగే పసుపు రంగు బంతిపూల మొక్కలను ఇంటి ముందు నాటడం వల్ల కూడా ఎలుకను రాకుండా ఉంటాయట. దీని నుంచి వచ్చే సువాసన ఎలుకలను తరిమికొట్టేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇంటి ముందు బంతి పువ్వు చెట్లను నాటడం వల్ల వీటిని అరికట్టవచ్చు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు బొద్దింకలను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. బంతి పువ్వు చెట్టును ఇంటి ముందు నాటడం వల్ల ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయట.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.