Tamarind: రోగనిరోధక శక్తిని పెంచే చింతకాయ రసం.. తయారీ విధానం!!

Tamarind Health Benefits: చింతకాయలు అంటే మనకు తెలుగు వారికి ఎంతో ప్రీతికరమైన పండ్లు. వంటల్లో, పచ్చళ్లలో ఎంతో రుచిని ఇస్తాయి. కానీ వీటిలోని ఆరోగ్య ప్రయోజనాలు  మీకు తెలుసా?  

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 26, 2024, 01:54 PM IST
Tamarind: రోగనిరోధక శక్తిని పెంచే చింతకాయ రసం.. తయారీ విధానం!!

Tamarind Health Benefits: చింతకాయలను తరుచు వంట్లో ఉపయోగిస్తాము. ఇది తీపి, పులుపును కలిగి ఉంటుంది. ఇది ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చింతకాయలు వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. 

చింతకాయల ఆరోగ్య ప్రయోజనాలు: 

చింతకాయల్లో అధిక శాంతం ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీని వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ క్రియ వ్యవస్థ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి  రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉంటాము. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో చింతపండు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉండేలా చేస్తాయి. సర్వ సమస్యలు కూడా తగ్గించడంలో చింతపండు సహాయపడుతుంది. చింతపండును వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు వీటితో పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు లేకపోతే చింతపండు రసం కూడా చేయవచ్చు.

చింతపండు రసం ఎలా తయారు చేసుకోవాలి?

చింతపండు రసం తయారు చేయడం చాలా సులభం. కేవలం కొన్ని సరైన పదార్థాలతో రుచికరమైన చింతపండు రసాన్ని తయారు చేసుకోవచ్చు.

అవసరమైన పదార్థాలు:

చింతపండు
నీరు
చక్కెర
ఉప్పు
కారం

తయారీ విధానం:

చింతపండును నీటిలో నానబెట్టి, పులుపు తీసివేయండి. నానబెట్టిన చింతపండును బ్లెండర్‌లో మెత్తగా రుబ్బండి. రుబ్బిన చింతపండు పేస్ట్‌ను నీటిలో కలిపి, వడకట్టి తీసుకోండి. వడకట్టిన రసంలో చక్కెర, ఉప్పు, కారం వంటి రుచులను సర్దుబాటు చేసుకుని, బాగా కలపండి.
చల్లగా సర్వ్ చేయండి.

చింతపండు రసాన్ని ఎప్పుడు తాగాలి?

వేసవి కాలంలో చల్లగా తాగితే చాలా రుచికరంగా ఉంటుంది. లేదా భోజనం తర్వాత తాగితే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జ్వరం, జలుబు లాంటి వ్యాధుల సమయంలో తాగితే ఉపశమనం కలుగుతుంది. వ్యాయామం తర్వాత చింతపండు రసం తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అందించి, శరీరాన్ని తిరిగి చురుగ్గా చేస్తుంది.

కొన్ని ఆరోగ్య సమస్యలకు చింతపండు రసాన్ని ఈ సమయాల్లో తాగవచ్చు:

మలబద్ధకం: రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు చింతపండు రసం తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

జీర్ణ సమస్యలు: భోజనం తర్వాత చింతపండు రసం తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

తీవ్రమైన జలుబు: చింతపండులో ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

తొందరగా కోపం వస్తున్నప్పుడు: చింతపండు రసం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

గమనిక: చింతపండు రసాన్ని అధికంగా తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మితంగా తాగడం మంచిది.

Read more: KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News