Amaravati New Railway Line: ఏపీకు కేంద్రం గుడ్‌న్యూస్, అమరావతి కొత్త రైల్వే లైనుకు గ్రీన్ సిగ్నల్

Amaravati New Railway Line: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి కేంద్రం గుడ్‌న్యూస్ విన్పించింది. అమరావతి కొత్త రైల్వే లైనుకు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఇదొక కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 24, 2024, 04:34 PM IST
Amaravati New Railway Line: ఏపీకు కేంద్రం గుడ్‌న్యూస్, అమరావతి కొత్త రైల్వే లైనుకు గ్రీన్ సిగ్నల్

Amaravati New Railway Line: ఏపీ ప్రతిపాదిత రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైందిగా భావిస్తున్న కొత్త రైల్వే లైను నిర్మాణానికి గ్రీనా్ సిగ్నల్ లభించింది. అమరావతి ప్రాంతానికి రైల్ కనెక్టివిటీని అందించే కొత్త రైల్వే లైనుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో అమరావతి రైల్వే లైనుకు ఆమోదం తెలిపింది. 

అమరావతి రైల్వే లైను విషయంలో కేంద్ర కేబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకూ కొత్త రైల్వే లైను నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రైల్వే లైను పొడవు 57 కిలోమీటర్లు ఉంటుంది. 2,245 కోట్ల వ్యయంతో అమరావతి కొత్త రైల్వే లైను నిర్మాణం జరగనుంది. ఇందులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణం కూడా జరగనుంది. 

ఈ కొత్త రైల్వే లైను నిర్మాణం పూర్తయితే అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాకు నేరుగా అనుసంధానం జరుగుతుంది. అమరలింగేశ్వర్ స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ధ, ఉండవల్లి గుహలకు వెళ్లేవారికి అనువైన మార్గం కానుంది. ఈ రైల్వే లైను తెలంగాణలో ఖమ్మం జిల్లా, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఉంటుంది. కొత్త రైల్వే లైను నిర్మాణంతో పాటు 25 లక్షల చెట్లు నాటే కార్యక్రమం కూడా ఉంటుంది. ఫలితంగా కాలుష్య నివారణకు వీలుంటుంది

ఇవాళ్టి కేబినెట్ భేటీలో ఏపీలో అమరావతి రైల్వే లైను నిర్మాణంతో పాటు బీహార్‌లో 256 కిలోమీటర్ల ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కొత్త రైల్వే లైన్లతో కొత్త పరిశ్రమల స్థాపన, ప్రజా రవాణా మరింతగా ఉంటాయన్నారు. 

Also read: Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఇండీ కూటమి సీట్ల సర్దుబాటు ఫిక్స్, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News