Zimbabwe vs Gambia: టీ20 క్రికెట్లో జింబాబ్వే చరిత్ర సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసి ఊచకోత కోసింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 344/4స్కోరు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా 43 బంతుల్లో 7 ఫోర్లు, 15సిక్సులు బాది మొత్తం 133 పరుగులతో పొట్టి ఫార్మాట్ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేశాడు.
ఈ క్రమంలో జింబాబ్వే తరపున ఇంటర్నేషనల్ టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డును క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక స్కోరును చేసిన రికార్డు పేరుమీద ఉండేది. 2024 ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్ ఈ ఫీట్ ను సాధించింది. గాంబియాపై సికిందర్ రజాతోపాటు తడివానాశే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, క్లైవ్ మండాడే పరుగులు వర్షం కురిపించారు.
సికందర్ రజా కేవలం 43 బంతుల్లో 133 పరుగులతో డాషింగ్, పేలుడు ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో, సికందర్ 15 సిక్సర్లు, 7 ఫోర్లతో చెలరేగిపోయాడు. చివరి వరకు నాటౌట్‌గా ఉన్నాడు. గాంబియాకు చెందిన ప్రతి బౌలర్ ఘోరంగా ఓడిపోయాడు. జింబాబ్వే బ్యాట్స్‌మెన్ ఏ బౌలర్‌ను వదలకుండా ఎవరు వచ్చినా చిత్తు చేశారు. టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక స్కోరు సాధించడంలో జట్టు విజయం సాధించడానికి ఇదే కారణం.
ఈ మ్యాచులో జింబాబ్వే భారీ స్కోరు చేయడంతో టెస్టులు ఆడే దేశాల్లో అత్యధిక స్కోరు చేసిజట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈమధ్యే హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ పై భారత్ 297/6 పరుగులు చేసి రికార్డ్ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.
టీ20ల్లో అత్యధిక స్కోర్లు:
జింబాబ్వే- 344/4 vs గాంబియా, అక్టోబర్ 2024
నేపాల్- 314/3 vs మంగోలియా, సెప్టెంబర్ 2023
భారతదేశం- 297/6 vs బంగ్లాదేశ్, అక్టోబర్ 2024
జింబాబ్వే- 286/5 vs సీషెల్స్, అక్టోబర్ 2024
ఆఫ్ఘనిస్తాన్- 278/3 vs ఐర్లాండ్, ఫిబ్రవరి 2019
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.