Free Gas Cylinder Scheme: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు దీపావళి కానుక అందించేందుకు సిద్ధమైంది. ఎన్నికల హామీల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన సూపర్ సిక్స్‌లో కీలకమైన ఫ్రీ గ్యాస్ సిలెండర్ అందించేందుకు రెడీ అయింది. ఈ నెల 31 నుంచి ఈ పధకం ఏపీలో అమలు కానుంది. దీనికి సంబంధించి రేపట్నించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
సూపర్ సిక్స్‌లో భాగమైన ఉచిత గ్యాస్ సిలెండర్ పధకం ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ పధకానికి అర్హత ఎవరెవరికి ఉంది, ఎవరు లబ్దిదారులనేది ఇప్పటికే ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది. ఈ పధకంలో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు అందించనున్నారు. దీనికోసం 2700 కోట్లు ఖర్చు కానుంది. కేబినెట్ భేటీలో కూడా ఆమోదించనున్నారు. అయితే ఈ పధకం అందరికీ వర్తించదనేది చాలామందికి తెలియదు.
ఫ్రీ గ్యాస్ సిలెండర్ అందరికీ కాదా, ఎవరెవరికి
కేవలం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకే ఉచిత గ్యాస్ సిలెండర్లు అందుతాయి. ఒక కుటుంబానికి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో నివాసముంటే ఇక్కడికి వచ్చివెళ్లేవారికి ఉచిత గ్యాస్ సిలెండర్ పధకం వర్తించదు. ఏపీలో స్థిర నివాసమున్నవారికే ఈ పధకం వర్తిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారైతే నెలకు 10 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు నెలకు 15 వేల రూపాయలు ఆదాయం మించకూడదు. ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు విధింగా ఉండాలి. ఇవి లేకుంటే ఈ పధకం వర్తించదు. అంతేకాకుండా ఉచిత గ్యాస్ సిలెండర్లను కమర్షియల్ పనులకు వినియోగిస్తే కఠిన చర్యలుంటాయి. ఫ్రీ గ్యాస్ సిలెండర్‌ను కేవలం గృహ వినియోగం కోసమే ఉపయోగించాలి.
ఈ పథకానికి అర్హులైనవారు రేపట్నించి ఆన్‌లైన్ విధానంలో లేదా వార్డు, గ్రామ, పట్టణ సచివాలయాల్లో నేరుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు అందిస్తారు. కానీ వెంటవెంటనే పొందేందుకు వీల్లేదు. ఒక సిలెండర్ తీసుకున్న తరువాత నెలన్నర, రెండు నెలల సమయం ఉండాలి. అప్పుడే రెండవది లభిస్తుంది.
Also read: Big Shock to Ys Jagan: వైఎస్ జగన్‌కు షాక్ ఇచ్చిన కీలక నేతలు, పార్టీకు రాజీనామా, ఘాటు విమర్శలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.