8Th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం శుభవార్త.. జీతం ఒక్కసారిగా బూస్ట్‌.. ఎంతంటే?


 8Th Pay Commission News Update:  త్వరలో కేంద్రం 8వ వేతన సంఘానికి సంబంధించిన ప్రకటను వెల్లడించబోతోంది. ఈ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఊహించని స్థాయిలో పెరగనున్నాయి. బేసిక్‌ పే రూ. 18,000 నుంచి రూ.  34,560 వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేతన సంఘానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

1 /7

8వ వేతన సంఘం అనేది భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పునర్విమర్శించడానికి ఏర్పాటు చేసిన ఒక సంఘం.  కేంద్రం కొన్ని సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాలను ఏర్పాటు చేస్తుంది.. ఉద్యోగుల జీతాలు, భత్యాలు, పెన్షన్లు మొదలైన వాటిని సమీక్షించి, తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పిస్తుంది.

2 /7

ఇటీవలే 7వ వేతన సంఘానికి సంబంధించిన డీఏ పెరగడంతో 8th pay commission  ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్తగా జరిగిన డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు తర్వాత ఈ సంఘంపై ఆసక్తి మరింత పెరిగింది.

3 /7

 8వ పే కమిషన్ ప్రకటన వచ్చే ఏడాది ప్రారంభంలో లేదా మధ్యలో వెలుబడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 2025 బడ్జెట్‌లో మాత్రం ఈ వేతన సంఘానికి సంబంధించిన చర్చలను కేంద్ర కేబినెట్‌ జరపబోతున్నట్లు తెలుస్తోంది.   ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ఆశాజనకమైన విషయం.  

4 /7

సాధారణంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొత్త పథకాలు, నిర్ణయాలను బడ్జెట్ ప్రకటనలో తెలుపుతుంది. కాబట్టి, 8వ పే కమిషన్‌ను 2025 బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

5 /7

8th pay commission సిఫార్సులు అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా జీతాలు కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. 

6 /7

 ఈ సంఘం అమల్లోకి వస్తే... కనీస వేతనం రూ. 18,000 నుంచి దాదాపు రూ. 34,560కి పెరుగుతుంది. అంటే దాదాపు 92% పెరుగుదల కనిపించే ఛాన్స్‌లు ఉన్నాయి. 

7 /7

అదేవిధంగా, పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ. 17,280కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వారి ఆర్థిక భద్రత పెరుగుతుంది. అంతేకాకుండా ఖర్చులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.