ESI-Ayushman Bharat Merger: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ అంటే ఈఎస్ఐను ఆయుష్మాన్ భారత్ పథకంతో కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ప్రకటన విడుదల చేసింది. ఫలితంగా ఉద్యోగులకు ఆరోగ్య సేవలు మరింత పెరగనున్నాయి. ఈఎస్ఐ పధకాన్ని ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య పధకంలో కలపనున్నారు.
ఉద్యోగుల ఆరోగ్య భీమా, ఆరోగ్య సంరక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన 86వ మెడికల్ బెనిఫిట్ కౌన్సిల్ సమావేశంలో రెండు కీలకమైన పథకాలను విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ పీఎం జన ఆరోగ్య పధకం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌గా ఉంది. దేశంలోని మొత్తం 12 కోట్ల మంది పేద కుటుంబాలకు లేదా 55 కోట్లమందికి ఏడాదికి 5 లక్షల వరకూ ఆరోగ్య భీమా అందిస్తోంది. మెడికల్ కౌన్సిల్ బెనిఫిట్ సమావేశంలో కామన్ అసిస్టెన్స్ మిషన్ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఆమోదం తెలిపారు.
అంటే ఇకపై ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ఈఎస్ఐను ఆయుష్మాన్ భారత్ పధకంలో విలీనం చేయనున్నారు. రాష్ట్రాల్లోని ఈఎస్ఐ వ్యవస్థను బలోపేతం చేసి మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే కామన్ అసిస్టెన్స్ మిషన్ లక్ష్యంగా ఉంది. అంతేకాకుండా ఏడాదికోసారి హెల్త్ చెకప్ పరీక్షలు ప్రారంభించేందుకు, అవగాహనా శిబిరాలు నెలకొల్పేందుకు కౌన్సిల్ ఆమోదించింది. తద్వారా లైఫ్‌స్టైల్ వ్యాధులు, సమస్యలు గుర్తించడం లేదా పోషక విలువల లోపం తలెత్తకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది.
ఈఎస్ఐ పథకాన్ని ఆయుష్మాన్ భారత్ పధకంతో కలపడం వల్ల వివిధ రాష్ట్రాల్లోని ఈఎస్ఐ పరిధిలో వచ్చే లబ్దిదారులకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందనున్నాయి.
Also read: ED Raids in Ap: వైసీపీ మాజీ ఎంపీ , సినీ నిర్మాత ఆస్థులపై ఈడీ దాడులు, వేట మొదలైందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.