Diabetes Coffee: ఖర్జూరం గింజలు పారేస్తున్నారు..? ఈ గింజలతో డయాబెటిస్‌ పరార్‌ !

Date Seed Coffee Benefits: ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. అయితే కేవలం ఖర్జూరం మాత్రమే కాకుండా దీని గింజలు కూడా శరీరానికి మేలు చేస్తాయి. దీంతో తయారు చేసే కాఫీ ఆరోగ్యానికి బోలెడు లాభాలు అందిస్తుంది. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 18, 2024, 11:34 PM IST
Diabetes Coffee: ఖర్జూరం గింజలు పారేస్తున్నారు..? ఈ గింజలతో డయాబెటిస్‌ పరార్‌ !

Date Seed Coffee Benefits: డ్రై ఫూట్స్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఫూట్స్‌ ఖర్జూరం. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ఇది బరువును నియంత్రించడంలో, శరీరానికి శక్తిని అందిచడంలో కీలక ప్రాత పోషిస్తుందని ఆరోగ్యానిపుణులు చెబుతుంటారు. అయితే కేవలం ఖర్జూరం మాత్రమే కాకుండా దీని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఖర్జూరం గింజల వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్యలాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం. 

ఖర్జూరం గింజల్లో ఫాస్ఫరస్‌, జింక్, పొటాషియం, మాంగనీష్‌ ఇతర ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలు. అయితే ఈ గింజలతో కాఫీ కూడా తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణ కాఫీలో కెఫీన్‌ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ ఖర్జూరం గింజలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్జూరం గింజల కాఫీ మాత్రం నాన్-యాసిడ్ ,  గ్లూటెన్-ఫ్రీ. ఈ కాఫీ తాగడం వల్ల శరీరానికి త్వరిత శక్తి లభిస్తుంది. దీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం ఈ కాఫీ తాగుతే అధిక బరువు, డయాబెటిస్, లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి..? అనే వివరాలు తెలుసుకుందాం. 

ఖర్జూరం గింజల్లో తయారీ: 

పండిన ఖర్జూరాల నుంచి గింజలను వేరు చేయండి. గింజలను శుభ్రంగా కడగి నీరు పీల్చేలా వదలండి. ఒక మిక్సీ జార్‌లో కొద్దిగా గింజలు వేసుకొని రుబ్బండి.
ఒక పాన్‌లో ఈ పొడిని వేసి నెమ్మదిగా వేయించండి. పొడి వాసన మారి, గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి. వేయించిన గింజలను చల్లారనివ్వండి.
చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడిని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వ చేయవచ్చు. ఒక కప్పులో ఒక టీస్పూన్ పొడి వేసి దానిపై వేడి నీరు పోయండి. కాఫీ తయారవుతున్నప్పుడు తేనె లేదా పాలు కలుపుకోవచ్చు.

ముఖ్యమైన విషయాలు:

ఖర్జూరం గింజల కాఫీలో కెఫిన్ ఉండదు కాబట్టి ఇది కెఫిన్‌కు అలర్జీ ఉన్నవారికి మంచి ఎంపిక.
ఈ కాఫీలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకుని తీసుకోవడం మంచిది.
ఖర్జూరం గింజల కాఫీ రుచి కొంచెం వేరుగా ఉంటుంది. కొంతమందికి ఇది నచ్చవచ్చు, మరికొంతమందికి నచ్చకపోవచ్చు.

గమనిక: ఏదైనా కొత్త ఆహారాన్ని ప్రారంభించే ముందు ఆరోగ్యనిపుణులు సలహా తీసుకోవడం చాాలా అవసరం.

Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News