Iddaru Movie Review: యాక్షన్ కింగ్ అర్జున్ ‘ఇద్దరు’ మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..!

Iddaru Movie Review: యాక్షన్ కింగ్ అర్జున్, జెడీ చక్రవర్తి కలయికలో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరు’.  ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  ఫర్హీన్ ఫాతిమా నిర్మించారు. డి.ఎస్.రెడ్డి సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 19, 2024, 07:20 AM IST
Iddaru Movie Review: యాక్షన్ కింగ్ అర్జున్ ‘ఇద్దరు’ మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..!

మూవీ రివ్యూ: ఇద్దరు (Iddaru)

నటీనటులు: యాక్షన్ కింగ్ అర్జున్, జెడి చక్రవర్తి, రాధిక కుమారస్వామి, కె విశ్వనాథ్, సమీర్, సోనీ చరిష్ట  త‌దిత‌రులు

ఎడిటర్: ప్రభు

సినిమాటోగ్రఫీ: అమీర్ లాల్

సంగీతం: సుభాష్ ఆనంద్

నిర్మాత: Md. ఫర్హీన్ ఫాతిమా, నేహా చౌదరి

బ్యానర్: ఎఫ్ ఎస్ ఎంర్టైన్మెంట్స్

దర్శకత్వం : ఎస్ ఎస్ సమీర్

విడుదల తేది: 18-10-2024

యాక్షన్ కింగ్ అర్జున్, జెడి చక్రవర్తి హీరోలుగా టైటిల్ రూల్ పోషించిన చిత్రం ‘ఇద్దరు’.  ఎన్నో అంచనాల తర్వాత ఎట్టకేలకు ఈ రోజు థియేట్రికల్ గా విడుదలైంది. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న  ఈ చిత్రం ఎట్టకేలకు ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం. .

కథ విషయానికొస్తే..

అర్జున్ ఓ మల్టీ మిలియనీర్. ఆయనకు సంబంధించి ఎన్నో కంపెనీలుంటాయి. అందులోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా పనిచేస్తుంటాడు జేడీ చక్రవర్తి. అతనికి రాత్రి రాత్రే కోటీశ్వరుడు కావాలనే ఆశలుంటాయి. ఈ క్రమంలో అతను తన బాస్ అయిన అర్జున్ ను ఓ లేడీతో హనీ ట్రాప్ చేయాలని ట్రై చేస్తాడు. అది గ్రహించిన అర్జున్.. దానికి పై ఎత్తు వేస్తాడు. ఈ క్రమంలో అర్జున్ ను హానీ ట్రాప్ చేసి కోటీశ్వరుడు కావాలన్న జేడీ ఎత్తులను అర్జున్.. ఎలాంటి పై ఎత్తు వేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగే ట్విస్టులు ఏమిటనే ‘ఇద్దరు’ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు సమీర్ ఈ సినిమాను కథను ఇద్దరు ఇంటెలిజెంట్ వ్యక్తుల మధ్య జరిగిన ఎత్తుకు పై ఎత్తుల నేపథ్యంలో  ‘ఇద్దరు’ సినిమాను తెరకెక్కించాడు. ఎన్నో వేల కోట్లకు అధిపతి అయిన అర్జున్ ను హానీ ట్రాప్ చేసి కోటీశ్వరుడు కావాలనుకున్న అతని కంపెనీలో పనిచేసే జేడీ చక్రవర్తి. అతని ఎత్తులను పసికట్టి అతని ఎత్తులకు పై ఎత్తులు వేయడం.. ఇలా సినిమా మొత్తం ట్విస్టులో   సినిమా మొత్తాన్ని పకడ్బందీ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు. గత కొన్నేళ్లుగా డిఫెన్స్ ఇతర రంగాల్లో వారిని హానీ ట్రాప్ కు గురి చేసి వారి నుంచి రహస్యాలను రాబట్టడం అనే కాన్సెప్ట్ ఈ సినిమాకు బలం. మొత్తంగా దర్శకుడు తాను ఎంచుకున్న కథకు అదే తరహా కథనంతో దాదాపు మెప్పించాడు. అక్కడక్కడ బోర్ కొట్టించినా.. ఓవరాల్ గా యాక్షన్ ప్రియులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి.  ఈ సినిమా కోసం ఎంచుకున్న కథకు అర్జున్, జేడీ సరైన న్యాయం చేసారు. అంతేకాదు వారితో సరైన నటన రాబట్టుకొన్నాడు. ఇలాంటి ఎత్తుకు పై ఎత్తులు వేయడం నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆసక్తి సినిమాపై పెంచాడు. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా ఇలాంటి ట్విస్ట్ లతో కూడిన యాక్షన్ సినిమాకు  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. ఫోటోగ్రఫీ బాగుంది.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

నటీనటుల విషయానికొస్తే..
యాక్షన్ కింగ్ అర్జున్ విషయానికొస్తే.. కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించాడు. జేడీ చక్రవర్తి తన పాత్రకు న్యాయం చేసాడు. మొత్తంగా ఇద్దరు సినిమాకు టైటిల్ కు తగ్గట్టు పోటాపోటీగా నటించారు. కేంద్ర మంత్రి కుమారి స్వామి భార్య రాధిక కుమార స్వామి తన పాత్రలో ఒదిగిపోయింది. సోనీ ఛరిష్టా తన గ్లామర్ తో అలరించింది.

లాస్ట్ పంచ్.. ‘ఇద్దరు’.. ఎత్తుకు పై ఎత్తుతో నడిచే యాక్షన్ డ్రామా..

రేటింగ్: 2.75/5

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News