Tamil Nadu State Anthem: బాధ్యతాయుత రాజ్యాంగ పదవిలో ఉండి స్థానిక పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించకపోవడంతో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ద్రవిడ సంస్కృతికి నిలయైన తమిళనాడులో 'ద్రవిడ' పదం ఉచ్ఛరించేందుకు గవర్నర్ సాహసించడం లేదు. తాజా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి 'ద్రవిడ' పదాన్ని ఉచ్ఛరించకపోవడంతో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సహా అక్కడి మంత్రులు, ప్రజాప్రతినిధులు, తమిళ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గవర్నర్ పదవి నుంచి అతడిని తొలగించాలనే డిమాండ్ తమిళనాడులో తీవ్రమైంది. అసలు ఏం జరిగింది? ఎక్కడ వివాదం మొదలైంది అనేది తెలుసుకుందాం.
Also Read: Radhika Merchant: పుట్టినరోజు వేడుకల్లో రాధిక మర్చంట్ కు ఘోర అవమానం.. ఏం జరిగిందంటే....?
ప్రభుత్వ రంగ ఛానల్ దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు శుక్రవారం చెన్నైలో జరిగాయి. ఇదే వేడుకలో హిందీ మాసోత్సవం కూడా నిర్వహించారు. హిందీని, హిందీ భాషేతర రాష్ట్రాల ఈవెంట్‌ను సంయుక్తంగా నిర్వహించడం వివాదానికి దారి తీసింది. ఇక ఇదే సమయంలో సమావేశంలో రాష్ట్ర గేయం ఆళపిస్తున్న సమయంలో 'ద్రవిడ' అనే పదం రాగా దానిని ఉచ్ఛరించలేదు. ద్రవిడ అనే పదం వచ్చిన చోట గాయకులు మొత్తం ఆ పదం పాడకుండా వదిలేశారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవి కూడా ద్రవిడ పదాన్ని విస్మరించి మిగతా గేయాన్ని పాడారు. ఇది అక్కడ తీవ్ర దుమారం రేపింది.
ఈ పరిణామంపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర వివాదం రాజుకుంది. గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు. తమిళనాడును, తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న గవర్నర్‌ను వెంటనే తొలగించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర గేయంలో ద్రవిడ పదాన్ని ఉచ్ఛరించకపోవడం చట్టరీత్య నేరంగా పరిగణించారు. జాతీయ గీతంలో జనగణమనలో ద్రవి పదం వస్తే ఇలానే వదిలేస్తారా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తమిళ మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు.
తీవ్ర వివాదం ఏర్పడిన నేపథ్యంలో వెంటనే గవర్నర్ కార్యాలయం రాజ్‌భవన్ స్పందించింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చింది. ఈ వ్యవహారంలో గవర్నర్ తప్పు లేదని స్పష్టం చేసింది. గాయకుల పొరపాటుగా బుకాయించింది. ఈ అంశంపై నిర్వాహకులు, అధికారులతో మాట్లాడినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అయితే తమిళ నాయకులు మాత్రం గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటివి గవర్నర్ ఆర్‌ఎన్ రవి చేశారని గుర్తుచేస్తున్నారు.
ஆளுநரா? ஆரியநரா?
திராவிடம் என்ற சொல்லை நீக்கி, தமிழ்த்தாய் வாழ்த்தைப் பாடுவது தமிழ்நாட்டின் சட்டத்தை மீறுவதாகும்!
சட்டப்படி நடக்காமல், இஷ்டப்படி நடப்பவர் அந்தப் பதவி வகிக்கவே தகுதியற்றவர்.
இந்தியைக் கொண்டாடும் போர்வையில் நாட்டின் ஒருமைப்பாட்டையும் இந்த மண்ணில் வாழும் பல்வேறு… pic.twitter.com/NzS2O7xDTz
— M.K.Stalin (@mkstalin) October 18, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి