Ragi Bellam Cake: రాగి బెల్లం కేక్ ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్ లేదా డెజర్ట్. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. గ్లూటెన్-ఫ్రీ అయినందున ఎవరైనా తినవచ్చు. ఈ కేక్ తయారీ చాలా సులభం. రాగి, బెల్లం రెండూ వేర్వేరుగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిని కలిపి తయారు చేసిన కేక్ మరింత పోషక విలువను కలిగి ఉంటుంది. ఈ కేక్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
రాగి బెల్లం కేక్ తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:
రాగిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. బెల్లంలో గ్లూకోజ్ అధికంగా ఉంటుంది. ఈ రెండు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా రాగ్లులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియవ్యవస్ధకు ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు రాగి బెల్లం కేక్ తినడం చాలా మంచిది. ముఖ్యంగా మహిళలు ఈ కేక్ తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే బరువు తగ్గాలని ప్రయత్నించే వారు ఈ కేక్‌ను తివచ్చు. ఇందులో ఉండే ఫైబర్ ఆకలి వేయదు. బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
కావలసిన పదార్థాలు:
రాగి పిండి - 1 కప్పు
బెల్లం పొడి - 1/2 కప్పు
నూనె - 1/4 కప్పు
పెరుగు - 1/4 కప్పు
గుమ్మడికాయ గింజలు - 1/4 కప్పు
బాదం పొడి - 2 టేబుల్ స్పూన్లు
బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
బేకింగ్ సోడా - 1/2 టీస్పూన్
వెనిల్లా ఎసెన్స్ - కొన్ని చుక్కలు
ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం:
180 డిగ్రీల సెల్సియస్ వద్ద ఓవెన్‌ను ప్రీహీట్ చేయండి. ఒక పాత్రలో రాగి పిండి, బెల్లం పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మరియు ఉప్పులను కలపండి. మరొక పాత్రలో నూనె, పెరుగు, వెనిల్లా ఎసెన్స్‌ను కలపండి. తడి పదార్థాలను పొడి పదార్థాలలో కలపండి. గుమ్మడికాయ గింజలు మరియు బాదం పొడిని కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని బేకింగ్ ట్రేలో పరచి, 30-35 నిమిషాలు లేదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బేక్ చేయండి. కేక్ చల్లారిన తర్వాత ముక్కలుగా కోసి సర్వ్ చేయండి.
ఎవరెవరు రాగి బెల్లం కేక్ తినవచ్చు:
పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు రాగి బెల్లం కేక్‌లో లభిస్తాయి.
గర్భధారణ సమయంలో అవసరమైన పోషకాలను అందిస్తుంది.
జీర్ణ సమస్యలు ఉన్న వృద్ధులకు ఇది మంచి ఆహారం.
బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఆరోగ్యకరమైన స్నాక్.
చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook