Schools Holiday: కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం.. రోడ్లు చెరువుల్లా మారడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోతున్నాయి. మరికొన్ని చోట్ల వర్షాలు భయానకంగా మారి ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నగరంలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సెలవు ఇచ్చింది చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు.
Also Read: Chennai Heavy Rains: చెన్నైలో భారీ వర్షాలు, 300 ప్రాంతాలు జలమయం
తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు కురుస్తుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నైలో నిత్యం వర్షాలు పడుతుండడంతో నగరవాసుల జీవనం స్తంభించింది. జనజీవనం అస్తవ్యస్తం కావడంతో అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలు నీట మునిగిపోవడంతో స్థానికులు బయటకు రాలేని పరిస్థితి. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చెన్నై నగర పాలక సంస్థ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.
Also read: Flash Flood Warning: ఏపీలోని ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, పొరపాటున కూడా బయటకు రావద్దు
కుండపోత వర్షాల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడనుండడంతో చెన్నై అధికారులు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే చెన్నై నగరం నీటితో నిండిపోయింది. భారీగా వరద వస్తుందనే భయంతో కొందరు తమ కార్లు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను ఫ్లైఓవర్లపై నిలిపి ఉంచుతున్న విషయం తెలిసిందే. చెన్నైలో మరికొన్నాళ్లు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక తమిళనాడుతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా స్థానిక అధికార యంత్రాంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక, ఏపీ, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రేపు శుక్రవారం కూడా సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.