Ugravatara Movie Updates: కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో గురుమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఉగ్రావతారం. ఎస్‌జీఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.జి సతీష్ నిర్మించారు. సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 1న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా.. తాజాగా సాంగ్, ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వేడుకకు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత రాజ్ కందుకూరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ఉగ్రావతారం వంటి కంటెంట్ ఉన్న మూవీ దసరాకు విడుదల కావాల్సిన సినిమా అన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాల ఆధారంగా తీసిన ఈ మూవీ ఆకట్టుకునేలా ఉందన్నారు. ప్రియాంక ఉపేంద్రకు మంచి విజయం దక్కాలని.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని కోరారు. కరాటే రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమాకు భాష లేదని.. కంటెంట్ బాగుంటే అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అన్నారు. ఉగ్రావతారం మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు.
ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని.. ఉపేంద్రను ఇక్కడే కలిశానని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్‌లో ఇదే ఫస్ట్ యాక్షన్ సినిమా అని.. డైరెక్టర్ గురుమూర్తి వల్లే ఈ సినిమా చేశానని చెప్పారు. కెకెమెరామెన్ నందకుమార్ అందరినీ తెరపై చక్కగా చూపించారని.. నటరాజ్ అద్భుతంగా మెచ్చుకున్నారు. తన మొదటి పాన్ ఇండియా మూవీని అందరూ చూడాలని కోరారు. డైరెక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలపైనే సినిమా తీశానని.. మంచి మెసేజ్ ఉంటుందన్నారు. ప్రియాంక ఉపేంద్ర కొత్తగా కనిపిస్తారని చెప్పారు.
నటుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ.. కర్తవ్యం మూవీలో విజయశాంతిని చూసి ఎలా అనుకున్నారో.. ఈ సినిమా తరువాత ప్రియాంకను అలానే అనుకుంటారని అన్నారు. ఈ మూవీ తన కొడుకు నటించడం సంతోషంగా ఉందన్నారు. అందరూ చూసి మంచి సక్సెస్ అందివ్వాలని కోరారు. నటరాజ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ గురుమూర్తి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. కంటెంట్ ఉన్న మూవీ అని.. మహిళలకు జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలను అమ్మవారు వచ్చి కాపాడితే ఎలా ఉంటుందని సినిమాలో చక్కగా చూపించారని అన్నారు.
Also Read: Muthyalamma Idol: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. ఏమన్నారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి