Telangana High Court: తెలంగాణలో ఈ నెల అంటే అక్టోబర్ 21 నుంచి జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు తెలంగాణ హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించి దాఖలైన కొన్ని పిటీషన్లపై విచారించిన తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టివేసింది. అంతేకాకుండా యధావిధిగా మెయిన్స్ పరీక్షలు నిర్వహించుకునేందుకు ఆమోదం తెలిపింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ జూన్ 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షకు 3.02 లక్షలమంది హాజరయ్యారు. ఇందులో 31, 382 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. దీనికి సంబంధించి గ్రూప్ 1 మెయన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు జరగాల్సి ఉంది. పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. నిన్నటి నుంచి హాల్‌టికెట్లు కూడా https://www.tspsc.gov.in/ టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
అయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో కొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన తెలంగాణ హైకోర్టు కొట్టిపారేసింది. యధావిధిగా మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించింది.
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ కీపై అభ్యంతరాలు, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్ధులకు హారిజంటల్ రిజర్వేషన్ అమలు, జీవో నెంబర్ 29 సవాలు, ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించడంపై సవాలు, స్పోర్ట్స్ సర్టిఫికేట్‌పై మధ్యంతర ఉత్తర్వులు, జీవో నెంబర్ 33 వంటి అంశాలకు సంబంధించి మొత్తం 22 పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో ఉన్నాయి. ఈ పిటీషన్ల కారణంగా మెయిన్స్ పరీక్షలు ఎక్కడ నిలిచిపోతాయోననే ఆందోళన అభ్యర్ధుల్లో నెలకొంది. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆ పిటీషన్లను కొట్టివేయడమే కాకుండా మెయిన్స్ పరీక్షలు యధావిధిగా నిర్వహించేందుకు అనుమతించడంతో అందరికీ ఊరట లభించింది.
Also read: TG DSC 2024: కొత్త టీచర్లకు బ్యాడ్‌న్యూస్, పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా, తిరిగి ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.