7th Pay Commission: మరికొన్ని గంటల్లో ఎగిరి గంతేసే వార్త.. దసరా వేళ జాక్ పాట్ .. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుదల ఎంతంటే..?

7th pay commission da hike news: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసర వేళ మోదీ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇది బంపర్ లాటరీ అని చెప్పుకొవచ్చు.

1 /7

ప్రస్తుతం దేశంలో దసరా నవరాత్రి ఉత్సవాలు నడుస్తున్నాయి. కొన్నిరోజులుగా దేశంలో విపరీతమైన ద్రవ్యోల్బణం సైతం నెలకొంది. చాలా మంది సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

2 /7

మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ శాలరీల పెంపుపై కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. తమకు రావాల్సిన డీఏ బకాయిలపై గంపేడాశాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో డీఏ పెంపుపై గుడ్ న్యూస్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

3 /7

మోదీ సర్కారు దసరాకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం కేంద్రం ఏడాదికి రెండు సార్లు డీఏ పెంచుతు వస్తుంది. జనవరి, జులైల్లో డీఏ పెంపుదల ఉంటుంది.

4 /7

 కొన్నేళ్లుగా ఇది పైపైకి వెళ్తూనే ఉంది. ప్రతిసారీ 3 శాతం లేదా 4 శాతం కేంద్రం ఇస్తు వస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే మోదీ సర్కార్ మార్చి నెలలో 4 శాతం డీఏను పెంచి.. 46 నుంచి 50 శాతానికి చేర్చింది. ఇప్పుడు దసరాకు ముందు మరోమారు.. 3 లేదా 4 శాతం డీఏ పెంచి.. ఒక్కసారిగా 53 శాతానికి చేర్చనున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది.

5 /7

దీంతో ఇది ప్రస్తుతం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్స్ లకు కూడా భారీగా లాభం ఉంటుందని తెలుస్తోంది.దాదాపుగా..  60 లక్షల మందికిపైగా పెన్షనర్లు లాభపడతారు. సాధారణంగా ప్రతి సంవత్సరం కరవు భత్యం.. జనవరి, జులై ఒకటో తేదీన రెండు సార్లు సవరించాలి.. కానీ కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా అలా కాకుండా.. దీనిని మార్చి, అక్టోబర్ సమయాల్లో ప్రకటిస్తుంది.

6 /7

 అయితే.. బకాయిలతో కలిపి వీటిని జనవరి, జులై 1 నుంచే ఇస్తు వస్తుంది. ఇప్పుడు కూడా అక్టోబర్ నెలలో డీఏ పెంపు ప్రకటించినా.. డీఏ సవరణ అనేది.. ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్‌పై (AICPI) ఆధారపడి ఉంటుంది. దీనిని కార్మిక శాఖ విడుదల చేస్తుంటుంది. 

7 /7

డీఏ పెంపు అనేది మూల వేతనంపై ఆధారపడి ఉంటుంది.  ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి నెల జీతం రూ. 32 వేలు అనుకుంటే దాంట్లో బేసిక్ పే రూ. 16 వేలుగా ఉందనుకుందాం. ఇక్కడ ప్రస్తుతం 50 శాతం డీఏ కింద రూ. 10 వేలు అదనంగా డీఏ రూపంలో అందుకుంటారు. మరో 3 శాతం డీఏ పెరిగితే.. అప్పుడు ఆ మొత్తం రూ. 9,840 అవుతుంది. అదే డీఏ 4 శాతం పెరిగితే రూ. 9,720 గా ఉంటుంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలను Zee Mediaధృవీకరించలేదు)