Heart Attack Signs: మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైంది గుండె. ఇది ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణాలు నిలబడతాయి. అందుకే గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. కానీ ఇటీవలి కాలంలో గుండె పోటు మరణాలు పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ గుండె పోటు సమస్య ఎదురౌతోంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి. గుండె ఆరోగ్యంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి..
Heart Attack Signs: సాధారణంగా గుండె నొప్పి వచ్చే ముందు వివిధ రకాల లక్షణాలు తప్పకుండా కన్పిస్తాయి. మనం సాధారణంగా నిర్లక్ష్యం చేస్తుంటాం. ముఖ్యంగా ఈ 5 లక్షణాలు మీలో ఎప్పుడైనా కన్పిస్తే వెంటనే అలర్ట్ అవండి. ఈ లక్షణాలు కన్పించాయంటే అర్ధం మీ గుండె ప్రమాదంలో ఉన్నట్టే. ఆ 5 లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.
మీ గుండె ప్రమాదంలో ఉంటే కన్పించే మరో ముఖ్యమైన లక్షణం అలసట, బలహీనత, ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే జాగ్రత్త పడండి. ఇవి గుండె వైఫల్యానికి కారణం కావచ్చు. వెంటనే వైద్యుని సంప్రదించాలి.
కాళ్లు, మోకాళ్లు, చీలమండలం వద్ద వాపు ఉంటే తేలిగ్గా తీసుకోవద్దు. ఇది కూడా గుండె నొప్పికి గుండె సంబంధిత వ్యాధికి లక్షణం. గుండె బలహీనమైనప్పుడు ఈ పరిస్థితి కన్పిస్తుంది. చాలామందికి తెలియని లక్షణం ఇది.
ఇక అన్నింటికంటే సాధారణమైంది గుండె చప్పుడు. హార్ట్ బీట్ వేగంగా ఉండటం లేదా క్రమ రహితంగా ఉండటం అనేది గుండె అనారోగ్యాన్ని తెలియజేస్తుంది.
గుండె పోటు వచ్చే ముందు కన్పించే మరో ప్రధాన లక్షణం దగ్గు, శ్వాసలో గురక. గుండె ఆరోగ్యంగా లేనప్పుడే ఈ సమస్య కన్పిస్తుంది. గుండె సరిగ్గా పనిచేయనప్పుడు ఊపిరితిత్తుల్లో నీరు చేరి దగ్గు వంటి లక్షణాలు కన్పిస్తాయి. అందుకే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు
గుండె పోటు వచ్చేముందు శ్వాస సంబంధిత సమస్యలు తప్పకుండా కన్పిస్తాయి. శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడం వంటివి. ఇది గుండె నొప్పికి ప్రధాన లక్షణం. పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ప్రాణాంతకమైంది.