Top Most Business Idea Before Dussehra And Diwali : ప్రస్తుతం చాలా మంది యువత ఉద్యోగ జీవితంలోని కట్టుబాట్ల నుంచి బయటపడి, స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఉద్యోగంలో ఉండే పని ఒత్తిడి, ఆందోళన, చిన్న జీతాలతో విసుగెత్తిపోతున్నారు. అదే మనం సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మనమే బాస్‌గా వ్యవహరించవచ్చు. స్వంత నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. అయితే ఎలాంటి బిజినెస్ మొదలు పెట్టాలి? ప్రస్తుతం ఏ బిజినెస్‌లకు డిమాండ్ అధికంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం.
చిన్న బిజినెస్ అంటే పెద్ద సంస్థల కంటే చిన్న స్థాయిలో నిర్వహించే వ్యాపారం. ఈ బిజినెస్‌లకు ఎక్కువ మంది పని చేయాల్సి అవసరం ఉండదు. అంతేకాకుండా చిన్న బిజినెస్‌లు మన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ప్రాత పోషిస్తాయి. ఇవి సమాజానికి సేవలు అందించడంలో కూడా దోహదపడుతాయి.
చిన్న బిజినెస్‌లో పూల వ్యాపారం కూడా ఒకటి. చాలా మంది పూల బిజినెస్ అంటే చిన్నచూపూ చూస్తుంటారు. కానీ పూల వ్యాపారం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే అపారమైన అవకాశాలను కలిగి ఉంది.
పండుగల సీజన్లో పూలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా హిందూవుల పండగల సమయంలో దేవుళ్ళకు పూలమాలు, పూజలలో పూలు కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా పెళ్లిళ్లు, పార్టీలు, ఇతర సామాజిక కార్యక్రమాలకు పూలను అలంకరణకు ఉపయోగిస్తారు.
పూల బిజినెస్‌కు డిమాండ్ పెరిగినప్పుడు సహజంగా ధరలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా అరుదైనా రకాల రకాల పూలకు విపరీతమైన ధరలు ఉంటాయి. అంతేకాకుండా డిమాండ్ పెరగడం వల్ల రైతులు పూల ఉత్పత్తిని పెంచుతారు.
పూల బిజినెస్‌ను మొదలు పెట్టాలని ఆలోశిస్తున్నారా ? దీని కోసం కేవలం 1000-1500 చదరపు అడుగుల స్థలం అవసరం. దీంతో పాటు ఒక రిఫ్రిజిరేటర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు పూల ప్యాకింగ్, డెలివరీ, పూల రైతుల నుంచి పువ్వులు కొనడం వంటి పనలు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే పూలకు ఉదయం ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో పూజ కోసం పువ్వులను కొంటారు. కొంతమంది పూల వ్యాపారులు గుడిలో పూజ కోసం పూలను సప్లై చేస్తుంటారు.
పూల బిజినెస్ మరింత ఎక్కువ రీచ్ కావాలంటే ఆన్లైన్, ఆఫ్‌లైన్ సహాయం కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బిజినెస్ గురించి ప్రకటనలు చేయవచ్చు.
ఈ బిజినెస్ ను మీరు కేవలం 50,000 పెట్టుబడి పెడితే సరిపోతుంది. మార్కెట్లో పూలకు రెట్టింపు ధరకు విక్రయిస్తే అధిక ఆదాయం కలుగుతుంది. ఉదాహరణకు ఒక పూవ్వు రూ.3 కు కొంటే మార్కెట్లో ధరకు రూ. 8కి విక్రయించవచ్చు. ఇలా నెలకు రూ. 10,000 నుంచి ₹30,000 వరకు లాభం పొందవచ్చు.
ప్రత్యేక రోజుల్లో పువ్వులను రూ 10 కంటే ఎక్కువగా విక్రయించిన భారీగా డబ్బులు సంపాదించుకోవచ్చు.ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి గవర్నమెంట్ కు సహాయపడుతుంది. ముద్ర లోక్ తో చిన్న బిజినెస్‌లకు కూడా ఆర్ధిక సహాయం పొందవచ్చు.