Kamal Haasan: కమలహాసన్ తో తొలిచూపులోనే ప్రేమ.. చివరి శ్వాస వరకు ఆయనే ప్రాణంగా బ్రతికిన హీరోయిన్..!

Sri Vidya-Kamal Haasan: సౌత్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కమలహాసన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు.. అని చెప్పవచ్చు.  ఈ నేపథ్యంలోనే ఈయనను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోయిన స్టార్ హీరోయిన్ శ్రీవిద్య , చివరి శ్వాస వరకు ఈయనను ప్రేమించిందని సమాచారం. 

1 /5

విశ్వ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమలహాసన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో , విలక్షణ నటుడిగా కూడా పేరు దక్కించుకున్న ఈయన,  ఒకే సినిమాలో పది అవతారాలలో నటించి రికార్డు సృష్టించారు. అంతేకాదు ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898AD సినిమాలో కీలకపాత్ర పోషించి అందరిని ఆశ్చర్యపరిచారు. కెరియర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఈయన వ్యక్తిగతంగా మాత్రం ఒంటరిగానే ఉంటున్నారని చెప్పవచ్చు.

2 /5

సారికను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరమ్మాయిలకు జన్మనిచ్చిన ఈయన అంతకుముందు  నటి వాణీ గణపతినీ వివాహం చేసుకొని విడాకులు ఇచ్చారు. సారిక తర్వాత గౌతమి తో సహజీవనం చేసి , ఇప్పుడు ఆమెకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇలాంటి ఈయనపై ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తొలి చూపులోనే ప్రేమను పెంచుకుంది. చివరి వరకు కమలహాసన్ పై ప్రేమను విడిచిపెట్టలేదు. ఆమె ఎవరో కాదు శ్రీవిద్య.

3 /5

తమిళం,  తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 800 కు పైగా చిత్రాలలో నటించిన ఈమె 1970లో లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకుంది. నటనతో పాటు కర్ణాటక సంగీతం భరతనాట్యంలో కూడా ప్రావీణ్యం పొందింది. కమలహాసన్ తొలి స్నేహితురాలు కూడా ఈమె కావడం గమనార్హం. 1953 జులై 23న జన్మించిన ఈమె తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది.  ఆమె తండ్రి ఎవరో కాదు ప్రముఖ కమెడియన్ కృష్ణమూర్తి . తల్లి వసంతకుమారి. కర్ణాటకకు చెందిన గాయని.   

4 /5

ఈమె పుట్టిన కొద్ది రోజులకే తండ్రి అరుదైన వ్యాధితో మరణించడంతో కుటుంబ భారాన్ని ఈమె తల్లి భుజాలపై వేసుకుంది. పిల్లలకు కనీసం పాలు ఇవ్వడానికి కూడా సమయం లేనంతగా కష్టపడి పిల్లలకు ఉన్నత స్థాయిని అందించింది. ఇక 1967లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీవిద్య తొలి విజయం అందుకుంది. ఇక రజనీకాంత్ తో తొలిసారి జతకట్టిన ఈమె.. అదే చిత్రంలో కమలహాసన్ కూడా నటించారు. ఆ సినిమాతోనే కమలహాసన్ తో ప్రేమలో పడింది.

5 /5

అయితే శ్రీవిద్య తల్లి ఆమె ప్రేమను అంగీకరించలేదు. ఇక దీంతో విడిపోయారు. కమలహాసన్ మాత్రం వాణి గణపతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో శ్రీవిద్యకు తీవ్రవాద కలిగింది. పెళ్లైన కొన్నేళ్లకే భరతన్ , జార్జ్ థామస్ లను వివాహం చేసుకున్న ఈమె కమలహాసన్ పై ప్రేమను చంపుకోలేకపోయింది.  ఇక ఇద్దరికీ దూరమైన ఈమె 2003లో క్యాన్సర్ సోకి , 2006లో మరణించింది. ఇక మరణానికి ముందు కూడా కమలహాసన్ ను చూడాలని కోరిందట శ్రీవిద్య.  అలా కమలహాసన్ ఆసుపత్రికి వెళ్లి ఆమె చివరి కోరిక తీర్చారు.  అలా తొలిచూపులోనే ప్రేమలో పడ్డ శ్రీ విద్య.. చివరి శ్వాస వరకు ఆయన ప్రేమ కోసమే పరితపించింది.