Exercise Time: వ్యాయామం అనేది మనిషికి చాలా అవసరం. ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు అతి ముఖ్యమైన సాధనం. వివిధ రకాల వ్యాధుల్నించి రక్షించుకునేందుకు తప్పనిసరి. మానసిక, శారీరక ఆరోగ్యం వ్యాయామంతోనే సాధ్యం. అయితే వ్యాయామం ఏ సమయంలో చేస్తే మంచిది..ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు చేయాలి
ఇక సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల రోజంతా పడిన ఒత్డిడి, శ్రమ దూరమౌతాయి. సాయంత్రం వ్యాయామం చాలా బాగుంటుంది. రాత్రి మంచి నిద్ర పట్టేందుకు బెస్ట్ పద్ధతి ఇది.
మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు కూడా వ్యాయామం చేయవచ్చు. శరీరం సహజసిద్ధమైన రిథమ్ ఉంటుంది. మద్యాహ్నం సమయంలో శరీరం ఉష్ణోగ్రత, కండరాల పని మెరుగ్గా ఉంటుంది. దాంతో శారీరక ప్రదర్శన బాగుంటుంది. దెబ్బలు తగిలినా నొప్పి తక్కువగా ఉంటుంది.
ఉదయం వేళ వ్యాయామం కాస్త సవాళ్లతో కూడుకుని ఉండవచ్చు. త్వరగా నిద్ర లేవలేనివారికి కష్టమే. ఉదయం త్వరగా లేవడం, వ్యాయామం కోసం బయటికెళ్లడం కాస్త ఇబ్బందికరమే.
ఉదయం వ్యాయామం చేయడం వల్ల మానసిక స్పష్టత, మూడ్ అన్నీ బాగుంటాయి. ఎండోఫిన్ ఉత్తేజితమౌతుంది. మూడ్ రోజంతా బాగుంటుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. నిద్ర శైలి మెరుగుపడుతుంది
వ్యాయామం చేసేందుకు సరైన సమయం అనేది వ్యక్తిగతంగా ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత ప్రాధాన్యతలు, ఫిటి నెస్ లక్ష్యాన్ని బట్టి ఉంటుంది.
ప్రతి రోజూ వ్యాయామం చేయమనే ప్రతి ఒక్కరూ సలహా ఇస్తుంటారు. వ్యాయామం అనేది దీర్ఘకాలం శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచుతుంది. అయితే వ్యాయామం చేసేందుకు సరైన సమయం ఏంటి, ఉదయమా లేక సాయంత్రమా అనేది చాలామందికి సందేహం ఉంటుంది