Game Changer: గేమ్ చేంజర్ విషయంలో పెద్ద షాక్.. మళ్ళీ షూటింగ్ అంటున్న డైరెక్టర్..!

Game Changer new release date: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న.. గేమ్ చేంజర్ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్ డేట్స్ వస్తాయి ఆని.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి.. ఇప్పుడు ఒక షాకింగ్ వార్త ఎదురైంది. షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది నిర్మాణాంతర పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.. అనుకుంటున్న సమయంలో.. డైరెక్టర్ శంకర్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 24, 2024, 03:20 PM IST
Game Changer: గేమ్ చేంజర్ విషయంలో పెద్ద షాక్.. మళ్ళీ షూటింగ్ అంటున్న డైరెక్టర్..!

Game Changer Update: ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ .. గ్లోబల్ రేంజ్ లో సక్సెస్ అందుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. నిజానికి వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అనగానే.. సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా మాత్రం చాలా .. వాయిదా పడుతూ వచ్చింది. 

ఈ సినిమాతో పాటుగా భారతీయుడు 2 .. షూటింగ్ కూడా పూర్తి చేశారు శంకర్. ఈ సినిమా కంటే ముందే భారతీయుడు 2 సినిమాని విడుదల చేశారు. అయితే ఒకప్పటి కల్ట్ క్లాసిక్ సినిమాకి సీక్వల్ గా వచ్చిన ఈ చిత్రం మాత్రం.. భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శంకర్ .. మీద కూడా అనుమానాలు మొదలయ్యాయి. 

ఈ నేపథ్యంలో గేమ్ చేంజెర్.. సినిమా ఎలా ఉంటుందో అని మెగా అభిమానులలో ఇప్పటినుంచి కంగారు మొదలైంది. అయితే ఈ మధ్యనే సినిమా షూటింగ్ పూర్తయింది అని.. రామ్ చరణ్ పాత్ర షూటింగ్ పూర్తి అయిపోయింది అంటూ.. చిత్ర బృంద అధికారికంగా ప్రకటించింది. ఇక కేవలం నిర్మాణం తర్వాత పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి అని.. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు.. అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

కానీ తాజాగా ఇప్పుడు శంకర్, రామ్ చరణ్ కి ఫోన్ చేసి ఒక నాలుగు, ఐదు రోజులు షూటింగ్ కోసం డేట్లు అడిగినట్లు తెలుస్తోంది. దీంతో రామ్ చరణ్ మాత్రమే కాక..నిర్మాత దిల్ రాజు కూడా షాక్ అయ్యారట. ఎప్పటినుంచో ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా.. ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో.. అసలే ఫ్యాన్స్ ఒక రేంజ్ లో కోపంగా ఉన్నారు. మరోవైపు శంకర్ ఇలాంటి ట్విస్ట్ లు ఇస్తూ ఫ్యాన్స్ కి.. మరింత కంగారు తెప్పిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది కానీ.. ఇందులో నిజం ఎంతవరకు ఉందో చూడాలి. 

ఇక శంకర్ ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటారో.. లేదో వేచి చూడాలి. కియార అద్వాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతుంది.. అని నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: YS Jagan: తొలిసారి జగన్‌ విశాఖ పర్యటన.. సీఎంగా ప్రమాణం చేస్తానన్న చోట అధికారం కోల్పోయి

Also Read: Tirumala Water Problem: తిరుమలలో నీటి సంక్షోభం.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News